UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ సెషన్ కు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం; లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
UGC NET June 2024: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET 2024) జూన్ సెషన్ కోసం ఏప్రిల్ 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ugcnet.nta.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
యూజీసీ నెట్ జూన్ సెషన్ కు అప్లై చేయండిలా..
యూజీసీ నెట్ జూన్ 2024 అర్హత
నాలుగు సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ లేదా 8 సెమిస్టర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న వారి తో పాటు, చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ లో ఉన్న విద్యార్థులు కూడా ఈ యూజీసీ నెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన విద్యార్థులు.. డిగ్రీలో వారు చదివిన ఏ సబ్జెక్ట్ లో అయినా పీహెచ్ డీ చేసేందుకు ఈ యూజీసీ నెట్ పరీక్ష రాయవచ్చు.
UGC NET జూన్ 2024: పరీక్ష విధానం
యూజీసీ నెట్ జూన్ 2024 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్ లో మాత్రమే నిర్వహిస్తారు. ఈ యూజీసీ నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండింటిలోనూ ఆబ్జెక్టివ్ తరహా, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలున్న రెండు పేపర్లకు కలిపి మొత్తం మూడు గంటల వ్యవధి ఉంటుంది.
యూజీసీ నెట్ జూన్ 2024 కు ఇలా అప్లై చేయండి
- ముందుగా విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలోని 'న్యూ రిజిస్ట్రేషన్' బటన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత, రిజిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- అందులో కనిపించే అప్లికేషన్ ఫామ్ ను నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
- సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.