CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్ఈ ఫలితాలు- ఇలా చెక్ చేసుకోండి..
CBSE results 2024 date : సీబీఎస్ఈ ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో.. ఇక్కడ చూడండి..
CBSE results 2024 date : సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలు, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థుల నిరీక్షణ కొనసాగుతోంది. ఫలితాల విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్ సీబీఎస్ఈ.. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాత ట్రెండ్స్‌ని పరిశీలిస్తే.. సీబీఎస్ఈ ఫలితాలు.. ఏప్రిల్- మేలో విడుదలవుతాయి. డేట్, టైమ్ వివరాలను సీబీఎస్ఈ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీబీఎస్ఈ ఫలితాలు 2024- ఈ వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోండి..
సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలను చెక్ చేసుకునేందుకు పలు వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవి..
cbseresults.nic.in
results.cbse.nic.in
CBSE 10th result 2024 date : cbse.nic.in
digilocker.gov.in
results.gov.in.
మొబైల్ యాప్స్:- డిజీలాకర్, ఉమంగ్.
ఇదీ చూడండి:- CBSE Board Result 2024: త్వరలో సీబీఎస్ఈ 10, 12 రిజల్ట్స్; గత ఐదేళ్ల ట్రెండ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి..
సీబీఎస్ఈ ఫలితాలు 2024- ఇలా చెక్ చేసుకోండి..
డిజీలాకర్‌లో సీబీఎస్ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి..
స్టెప్ 1:- డిజీలాకర్ యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- అకౌంట్ ఉంటే సైన్-ఇన్ చేసుకోండి. లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
CBSE 12th result 2024 date : స్టెప్ 3:- హోం పేజ్‌లోకి వెళ్లి.. సీబీఎస్ఈ రిజల్ట్స్ లింక్ కోసం చూడండి. దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4:- సంబంధిత వివరాలను సబ్మీట్ చేయండి. స్కోర్ డిస్ప్లే అవుతుంది.
ప్రొవిజనల్ మార్క్‌షీట్‌ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
స్టెప్ 1:- results.cbse.nic.in లోకి వెళ్లండి.
స్టెప్ 2:- క్లాస్ 10 లేదా క్లాస్ 12 ఫలితాల పేజ్‌లోకి వెళ్లండి.
CBSE results 2024 latest news : స్టెప్ 3:- మీ సమాచారాలను సబ్మీట్ చేయండి.
స్టెప్ 4:- సీబీఎస్ఈ రిజల్ట్‌ని చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి.
ఈ ఏడాది.. సీబీఎస్ఈ క్లాస్ 10 పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చ్ 13 వరకు జరిగాయి. క్లాస్ 12 పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. సింగిల్ షిప్ట్‌లోనే ఈ రెండు తరగతుల పరీక్షలను నిర్వహించారు. సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షల కోసం 39 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
CBSE latest news : సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు 2024 అప్డేట్స్ కోసం హిందుస్థాన్ టైమ్స్ తెలుగుని ఫాలో అవ్వండి. సీబీఎస్ఈ ఫలితాలకు సంబంధించిన డేట్, టైమ్ వివరాలు బయటకు వచ్చిన వెంటనే.. మేము మీకు అప్డేట్ చేస్తాము.
సంబంధిత కథనం