TS Inter 1st Year Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!-telangana intermediate board 1st year results 2024 ts 1st year inter voc results check results in tsbiecgggovin ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter 1st Year Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!

TS Inter 1st Year Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Apr 24, 2024 12:00 PM IST

TS Inter 1st Year Results 2024 : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్(జనరల్/ఒకేషనల్) ఫలితాలు విడుదలయ్యాయి. హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను సింగిల్ క్లిక్ లో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

TS Inter 1st Year Results 2024 : తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు(TS Inter 1st Year Results 2024 out ) విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో విద్యాశాఖ అధికారులు ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు(జనరల్/ఒకేషనల్) విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే హెచ్.టి. తెలుగు వెబ్ సైట్ లో వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత 60.01 శాతం అని అధికారులు తెలిపారు. ఇవాళ 5 గంటల నుంచి మార్కుల మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

బాలికలదే పై చేయి

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,30,413 మంది రెగ్యులర్, 48,310 మంది ఒకేషనల్ మొత్తంగా 4,78,723 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ 2,62,829 మంది విద్యార్థులు అంటే 61.06 శాతం పాస్ అయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్ లో 24,432 మంది అంటే 50.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 2,87,261 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ లో పాస్ అయ్యారు. ఉత్తీర్ణత 60.01 శాతం. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి. మొత్తం 1,65,190 మంది బాలికలు పాస్ అయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 68.35 కాగా బాలురది 51.50 శాతంగా ఉంది. ఇంటర్ ఫస్టియర్ లో 71.70 శాతంతో రంగారెడ్డి జిల్లా టాప్ లో నిలిచింది. కామారెడ్డి చివరి స్థానంలో ఉంది.

  • రంగారెడ్డి జిల్లా -71.70 శాతం
  • మేడ్చల్ జిల్లా -71.58 శాతం
  • ములుగు జిల్లా- 70.01 శాతం
  • ఖమ్మం -63.84 శాతం
  • కరీంనగర్ -63.41 శాతం

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ మార్కులు(TS Inter 1st Year Marks) :

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ మార్కులు(TS Inter Voc First Year Marks) :

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024

తెలంగాణ ఇంటర్ ఒకేషనల్ ఫస్టియర్ ఫలితాల లింక్ :

https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result-2024

 

 

Whats_app_banner

సంబంధిత కథనం