CBSE Board Result 2024: త్వరలో సీబీఎస్ఈ 10, 12 రిజల్ట్స్; గత ఐదేళ్ల ట్రెండ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి..-cbse board result 2024 check past trends of class 10 12 results ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Board Result 2024: త్వరలో సీబీఎస్ఈ 10, 12 రిజల్ట్స్; గత ఐదేళ్ల ట్రెండ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి..

CBSE Board Result 2024: త్వరలో సీబీఎస్ఈ 10, 12 రిజల్ట్స్; గత ఐదేళ్ల ట్రెండ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి..

HT Telugu Desk HT Telugu
Apr 13, 2024 02:55 PM IST

CBSE Board Result 2024: సీబీఎస్ఈ 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఫలితాలను ప్రకటించనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. అయితే, గత ఐదేళ్లుగా ఈ పరీక్షల ఫలితాల ట్రెండ్ ఎలా ఉందో ఇక్కడ చూడండి.

సీబీఎస్ఈ బోర్డ్ 2024 రిజల్ట్స్
సీబీఎస్ఈ బోర్డ్ 2024 రిజల్ట్స్ (PTI File)

CBSE Board Result 2024: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024 సీబీఎస్ఈ బోర్డు ఫలితాలను త్వరలోనే ప్రకటించనుంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. 10, 12 తరగతుల ఫలితాలు cbse.nic.in, results.cbse.nic.in వెబ్ సైట్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఫలితాలను తనిఖీ చేయడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. అలాగే, డిజిలాకర్ వెబ్సైట్, డిజిలాకర్ మొబైల్ యాప్, ఉమంగ్ మొబైల్ యాప్ ల్లో కూడా రిజల్ట్ చూసుకోవచ్చు.

ఫిబ్రవరి, మార్చిల్లో పరీక్షలు

ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. అన్ని పరీక్షలను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఒకే షిఫ్టులో నిర్వహించారు.

సీబీఎస్ఈ బోర్డు ఫలితాల గత ఐదేళ్ల ట్రెండ్స్

సీబీఎస్ఈ బోర్డు ఫలితాల గత 5 సంవత్సరాల ట్రెండ్స్ ను ఇక్కడ చూడవచ్చు.

2023: 2023 లో సీబీఎస్ఈ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలు మే 12న విడుదలయ్యాయి. పదో తరగతి (CBSE 10TH CLASS)లో 93.12 శాతం, 12వ తరగతిలో 87.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి పరీక్షలకు మొత్తం 16,60,511 మంది అభ్యర్థులు హాజరుకాగా, 14,50,174 మంది ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతికి 21,65,805 మంది అభ్యర్థులు హాజరుకాగా, 20,16,779 మంది ఉత్తీర్ణత సాధించారు.

2022: 2022 లో సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫైనల్ పరీక్షల ఫలితాలు ఆలస్యంగా, జులై 22న విడుదల అయ్యాయి. పదో తరగతిలో 94.40 శాతం, 12వ తరగతి (CBSE 12TH CLASS) లో 92.71 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతికి మొత్తం 20,93,978 మంది విద్యార్థులు హాజరుకాగా 19,76,668 మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా 12వ తరగతికి 14,35,366 మంది విద్యార్థులు హాజరుకాగా 13,30,662 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

2021: 2021 లో కూడా సీబీఎస్ఈ రిజల్ట్స్ లేట్ గానే ప్రకటించారు. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను ఆగస్టు 3న, 12వ తరగతి ఫలితాలను జూలై 30న ప్రకటించారు. పదో తరగతిలో 99.04 శాతం, 12వ తరగతిలో 99.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12వ తరగతి బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర కంటే మెరుగ్గా ఉంది'. బాలికల ఉత్తీర్ణత శాతం 99.67%, బాలుర ఉత్తీర్ణత 99.13%, ట్రాన్స్ జెండర్లు 100% ఉత్తీర్ణత సాధించారు.

2020: 2020 లో (CBSE) పదవ తరగతి ఫలితాలు జూలై 16న, 12వ తరగతి ఫలితాలు జులై 13న విడుదలయ్యాయి. పదో తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 91.46%, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం 88.78%. పదో తరగతికి 18,73,015 మంది విద్యార్థులు హాజరుకాగా, 20,837 పాఠశాలల్లో 17,13,121 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 12వ తరగతికి 11,92,961 మంది విద్యార్థులు హాజరుకాగా 10,59,080 మంది ఉత్తీర్ణత సాధించారు.

2019: సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు మే 6వ తేదీన విడుదలయ్యాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు మే 2న విడుదలయ్యాయి. 12వ తరగతి ఉత్తీర్ణత 83.4 శాతంగా నమోదైంది. పదో తరగతి ఉత్తీర్ణత శాతం 91.10గా నమోదైంది. పదో తరగతిలో బాలికల ఉత్తీర్ణత 92.45 శాతం, బాలుర ఉత్తీర్ణత 90.14 శాతం, ట్రాన్స్ జెండర్లు 94.74 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Whats_app_banner