Chardham Yatra 2024: హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన నాలుగు పవిత్ర దేవాలయాల సందర్శనకు ఉద్దేశించిన చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకు మే 8వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 2024 మే 8 నుండి హరిద్వార్, రిషికేష్లలో ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు హరిద్వార్ లోని రాహి మోటెల్, రిషికేశ్ లోని యాత్ర రిజిస్ట్రేషన్ కార్యాలయం అండ్ ట్రాన్సిట్ క్యాంప్ లో జరుగుతాయి.
ప్రతి ధామ్ కు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కు రోజువారీ గరిష్ట పరిమితిని రిషికేశ్ లో 1000, హరిద్వార్ లో 500 గా నిర్ణయించారు. అక్షయ తృతియ సందర్భంగా మే 10 నుంచి చార్ ధామ్ యాత్ర 2024 (Chardham Yatra 2024) ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్ర నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, యాత్రికులు యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు హిందూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
చార్ ధామ్ యాత్ర 2024 ను విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ తీర్థ్ పురోహిత్ మహాపంచాయత్ ఉత్తరాఖండ్ పర్యాటక శాఖతో సమన్వయం చేయడానికి ప్రతి ధామ్ నుండి ఇద్దరు తీర్థ్ పురోహితులను నామినేట్ చేసింది. చార్ ధామ్ యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పర్యటన."చార్ ధామ్" అనే పదం రెండు హిందీ పదాల నుండి ఏర్పడింది. 'చార్' అంటే నాలుగు, మరియు 'ధామ్' అంటే మతపరమైన ప్రదేశాలు. కాబట్టి చార్ ధామ్ యాత్ర అనే పేరుకు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు హిందూ పుణ్యక్షేత్రాలకు మతపరమైన తీర్థయాత్ర అని అర్థం.
చార్ ధామ్ యాత్ర కోసం ఆన్ లైన్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ దశలను అనుసరించడం ద్వారా చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
టాపిక్