Truecaller web: ఇక పీసీ, లాప్ టాప్ ల్లోనూ మొబైల్ నంబర్స్ చెక్ చేయవచ్చు; ట్రూ కాలర్ వెబ్ లాంచ్-truecaller web rolled out know how to get it on your pclaptop ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Truecaller Web: ఇక పీసీ, లాప్ టాప్ ల్లోనూ మొబైల్ నంబర్స్ చెక్ చేయవచ్చు; ట్రూ కాలర్ వెబ్ లాంచ్

Truecaller web: ఇక పీసీ, లాప్ టాప్ ల్లోనూ మొబైల్ నంబర్స్ చెక్ చేయవచ్చు; ట్రూ కాలర్ వెబ్ లాంచ్

HT Telugu Desk HT Telugu
Apr 12, 2024 02:17 PM IST

Truecaller web: ట్రూ కాలర్ యాప్ లేని స్మార్ట్ ఫోన్స్ చాలా అరుదు. ప్రతీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ కచ్చితంగా ఉంటుంది. తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు, ఆ నంబర్ ఎవరితో తెలుసుకోవడం, స్పామ్ కాల్స్ ను అడ్డుకోవడం ట్రూ కాలర్ తో ఈజీగా సాధ్యమవుతుంది.

అందుబాటులోకి ట్రూ కాలర్ వెబ్
అందుబాటులోకి ట్రూ కాలర్ వెబ్

Truecaller: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అత్యంత ఉపయోగపడే యాప్స్ లో ట్రూ కాలర్ ఒకటి. దీనితో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ వివరాలు తెలుసుకోవచ్చు. స్పామ్ కాల్స్, బిజినెస్ కాల్స్, మార్కెటింగ్ కాల్స్ వంటి వాటిని అడ్డుకోవచ్చు.

yearly horoscope entry point

ట్రూ కాలర్ లో వాట్సాప్ తరహా ఫీచర్

తాజాగా, వాట్సాప్ ను పోలిన ఫీచర్ ను ట్రూ కాలర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ను మొదట భారత్ లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తరువాతనే ఇతర దేశాల్లో లాంచ్ చేస్తారు. అయితే కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ లభిస్తుంది. ఆపిల్ ఐఓఎస్ యూజర్లు మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

ట్రూ కాలర్ వెబ్

మరోవైపు, ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్స్ కే పరిమితమైన ట్రూ కాలర్ (Truecaller) సేవలు ఇకపై పీసీలు, డెస్క్ టాప్స్, ల్యాప్ టాప్ లకు కూడా విస్తరించనున్నాయి. అందు కోసం ట్రూ కాలర్ లేటెస్ట్ గా ట్రూ కాలర్ వెబ్ (Truecaller web) ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘‘ట్రూకాలర్ ఫర్ వెబ్ ఇక్కడ ఉంది! డెస్క్ టాప్ యాక్సెస్? అవును!.. స్పామ్-ఫ్రీ టెక్స్టింగ్? పూర్తిగా!.. స్మార్ట్ కాల్ అలర్ట్స్? మీకు అర్థమైందా! ఆండ్రాయిడ్ కోసం ట్రూకాలర్ వెబ్ ఇప్పుడు అందుబాటులో ఉంది’’ అని ట్రూకాలర్ తన ఎక్స్ పోస్ట్ లో వెల్లడించింది. ట్రూకాలర్ వెబ్ తో రియల్ టైమ్ లో తమ డెస్క్ టాప్, పీసీ, ల్యాప్ టాప్ ల్లో తమ ట్రూ కాలర్ ఐడీ (Truecaller ID) ని సింక్రనైజ్ చేసుకోవచ్చు. యూజర్లకు ఎస్ఎంఎస్, చాట్ మిర్రరింగ్, నంబర్ సెర్చ్, కాల్ నోటిఫికేషన్ తదితర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి

ట్రూకాలర్ వెబ్ కు ఎలా లింక్ చేయాలి?

ట్రూ కాలర్ వెబ్ (Truecaller web) కు లింక్ చేయడం చాలా సులువు. వాట్సాప్ వాడుతున్న వారికి ఈ ప్రక్రియ బాగా సుపరిచితమే. మీ ట్రూకాలర్ ఐడీ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ తో డెస్క్ టాప్ లో కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు. అందుకు గానూ ఈ కింది స్టెప్ట్ ఫాలో కండి.

  • మీ స్మార్ట్ ఫోన్ (smartphone) లో ట్రూకాలర్ యాప్ ను ఓపెన్ చేయండి.
  • మెసేజ్ లకు వెళ్లి, పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
  • అక్కడ "ట్రూకాలర్ ఫర్ వెబ్" ను ఎంచుకోండి.
  • "లింక్ డివైస్" పై ట్యాప్ చేయండి. స్కానర్ ఓపెన్ అవుతుంది.
  • మీ స్మార్ట్ ఫోన్ తో డెస్క్ టాప్ స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయండి.

ట్రూకాలర్ తో ప్రయోజనాలు

ట్రూకాలర్ కాలర్ ఐడీతో మీకు ఎవరు కాల్ చేస్తున్నారో తెలిసిపోతుంది. రోబోకాలర్లు, స్కామర్లు, మోసగాళ్లు, టెలీమార్కెటర్లు, ఇతర అవాంఛిత లేదా తెలియని ఫోన్ నంబర్లను గుర్తించి హెచ్చరిస్తుంది. అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్ ల నుంచి ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తుంది.

Whats_app_banner