JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
JEE Advanced Admit Card release date : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డు విడుదలైంది. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
JEE Advanced Admit Card 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డును.. మే 17, 2024న విడుదల చేసింది ఐఐటీ, మద్రాస్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్ డ్ హాల్ టికెట్లను jeeadv.ac.in ఐఐటీ జేఈఈ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024..
ఐఐటీ జేఈఈ అడ్మిట్ కార్డు లింక్‌ను మే 26, 2024 మధ్యాహ్నం 2.30 గంటల వరకు అధికారిక వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షను మే 26, 2024న నిర్వహించనున్నారు. పరీక్షలో మూడు గంటల వ్యవధి గల రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. రెండు పేపర్లలో హాజరుకావడం తప్పనిసరి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్టులో పేపర్-2 నిర్వహిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులో.. అభ్యర్థి పేరు, జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రోల్ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, కరస్పాండెన్స్ చిరునామా, కేటగిరీ వంటి వివరాలు ఉంటాయి. అంతేకాకుండా అడ్మిట్ కార్డులో అభ్యర్థికి కేటాయించిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా ఉంటుంది. అడ్మిట్ కార్డు తీసుకున్న వెంటనే.. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని జాగ్రత్తపడాలి.
How to download JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకునేందుకు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- స్టెప్ 1:- jeeadv.ac.in ఐఐటీ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- స్టెప్ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డు లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3:- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయవచ్చు.
- స్టెప్ 4:- సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
- స్టెప్ 5:- తదుపరి అవసరాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డు హార్డ్ కాపీని జాగ్రత్తపరుచుకోండి.
JEE Advanced exam 2024 : అధికారిక వెబ్సైట్ ప్రకారం.. అభ్యర్థుల సమాధానాల కాపీ 2024 మే 31 న వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2024 జూన్ 2న ఆన్లైన్లో ప్రదర్శిస్తారు. 2024 జూన్ 3 వరకు అభ్యంతర విండో తెరిచి ఉంటుంది. ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ 2024 జూన్ 9న అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం అభ్యర్థులు.. ఐఐటీ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
ఐఐటీలో అడ్మిషన్ కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ముందు.. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అందులో క్వాలిఫై అయ్యి, కటాఫ్ మార్కు దాటిన వారికి.. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత లభిస్తుంది. ఈ రెండు పరీక్షల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ప్రతియేటా తీవ్రంగా కృషిచేస్తూ ఉంటారు.
సంబంధిత కథనం