NEET UG Admit Card 2024 Download: నీట్ (NEET-UG)) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency). ఈ ప్రవేశ పరీక్ష ద్వారా… దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఇందుకోసం ప్రతి ఏడాది నీట్ యూజీ (NEET UG 2024) పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన అడ్మిట్ కార్డులు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి.
ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు neet.ntaonline.in లేదా exams.nta.ac.in వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఈ పరీక్ష 571 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఈ ఎగ్జామ్ మే 5వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ పరీక్ష కోసం ఏపీ, తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు పోటీ పడుతుంటారు.
గతేడాది జరిగిన నీట్ యూజీ 2023 ఫలితాలను పరిశీలిస్తే… ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన బోర వరుణ్ చక్రవర్తి టాపర్ గా నిలిచాడు. అతడు 99.99 పర్సంటైల్ సాధించాడు. అలాగే, తమిళనాడుకు చెందిన మరో విద్యార్థి ప్రభంజన్ జే కూడా 99.99 పర్సంటైల్ తో టాపర్ గా నిలిచాడు.
గతేడాది ఉత్తర ప్రదేశ్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు నీట్ యూజీ లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్తాన్ నిలిచాయి. నీట్ యూజీ 2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. అవి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ, ఒడియా, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ.
2023 నీట్ యూజీ (NEET UG) లో కటాఫ్ (CUT OFF) మార్కులు అన్ని కేటగిరీల్లోనూ పెరగడం విశేషం. నీట్ యూజీ ఫలితాలు వెలువడిన తరువాత.. విద్యార్థుల ఆన్సర్ షీట్స్ రీ వాల్యుయేషన్ కు కానీ, రీ చెకింగ్ కు కానీ ఎలాంటి అవకాశం ఉండదు. నీట్ యూజీ పరీక్షలో సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి మైనస్ 1 మార్క్ ఉంటుంది. ఏ సమాధానం ఇవ్వకపోతే.. ఎలాంటి మార్కులు ఉండవు.