NEET PG 2024 : నేటి నుంచి నీట్​ పీజీ 2024 రిజిస్ట్రేషన్​- ఇలా అప్లై చేసుకోండి..-neet pg 2024 registration to begin today check how to apply online ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Pg 2024 : నేటి నుంచి నీట్​ పీజీ 2024 రిజిస్ట్రేషన్​- ఇలా అప్లై చేసుకోండి..

NEET PG 2024 : నేటి నుంచి నీట్​ పీజీ 2024 రిజిస్ట్రేషన్​- ఇలా అప్లై చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Apr 17, 2024 09:25 AM IST

NEET PG 2024 Registration : నీట్​ పీజీ 2024కి ప్రిపేర్​ అవుతున్న వారికి అలర్ట్​! నీట్​ పీజీ 2024 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేడు మొదలవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

నీట్​ పీజీ 2024కి ఇలా అప్లై చేసుకోండి..
నీట్​ పీజీ 2024కి ఇలా అప్లై చేసుకోండి..

NEET PG 2024 registration date : నీట్ పీజీ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏప్రిల్ 16, 2024న ప్రారంభించనుంది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, ఎన్​బీఈఎంఎస్. నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్​బీఈ అధికారిక వెబ్​సైట్​ natboard.edu.in లింక్​ను పరిశీలించవచ్చు.

ఈ నీట్​ పీజీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 6, 2024 గా ఉంది. ప్రీ-ఫైనల్ ఎడిట్ విండో మే 28న ప్రారంభమై.. జూన్ 3, 2024తో ముగుస్తుంది. ఫైనల్ ఎడిట్ విండో జూన్ 7న ప్రారంభమై జూన్ 10, 2024న ముగుస్తుందని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

NEET PG 2024 notification : నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024.. జూన్ 18న అందుబాటులోకి వస్తుంది. నీట్​ పీజీ పరీక్షను 2024 జూన్ 23న నిర్వహించి, 2024 జూలై 15న ఫలితాలను ప్రకటిస్తారు. ఇంటర్న్​షిప్​ పూర్తి కావడానికి కటాఫ్ తేదీ 2024 ఆగస్టు 15గా ఉంది.

ఇదీ చూడండి:- RPF Notification 2024 : నిరుద్యోగులకు శుభవార్త- 4,660 ఆర్పీఎఫ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..

నీట్ పీజీ 2024: ఎలా అప్లై చేసుకోండి..

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ ఈ క్రింది చెప్పిన స్టెప్స్​ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

  • స్టెప్​ 1- natboard.edu.in ఎన్​బీఈ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.
  • NEET PG 2024 exam date : స్టెప్​ 2- నీట్​ పీజీ 2024 హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న నీట్ పీజీ 2024 లింక్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 3- రిజిస్టర్ చేసుకోండి. అకౌంట్​లోకి లాగిన్ అవ్వండి.
  • స్టెప్​ 4- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • స్టెప్​ 5- సబ్మిట్ బటన్​పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • స్టెప్​ 6- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి.

How to apply for NEET PG 2024 : పరీక్ష ఫీజు: నీట్​ పీజీ 2024 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500. నిర్దేశిత పరీక్ష రుసుమును క్రెడిట్ కార్డ్ లేదా భారతదేశంలోని బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డు లేదా వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న మార్గం లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి అందించే పేమెంట్ గేట్ వే ద్వారా పంపాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్​బీఈఎంఎస్ అధికారిక వెబ్​సైట్​ని చూడటం ఉత్తమం.

నీట్​ పీజీ 2024 అధికారిక ప్రకటనను చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

వైద్య విద్యార్థులకు నీట్​ పోస్ట్​ గ్రాడ్జ్యుయేషన్​ చాలా కీలకమైన పరీక్ష. ఇందులో ఉత్తీర్ణులై మంచి సీటు సంపాదించుకోవాలని విద్యార్థులు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు. అందుకే.. నీట్​ పీజీ 2024 అప్డేట్స్​ని ఎప్పటికప్పుడు ట్రాక్​ చేస్తూ ఉండటం మేలు.

Whats_app_banner

సంబంధిత కథనం