NEET MDS results 2024: నీట్ ఎండీఎస్ రిజల్ట్స్ విడుదల; ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
NEET MDS results 2024: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్ ఎండీఎస్ 2024 ఫలితాలను బుధవారం విడుదల చేసింది. నీట్ ఎండీఎస్ 2024 పరీక్ష రాసిన విద్యార్థులు నీట్ అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
NEET MDS results 2024: నీట్ ఎండీఎస్ 2024 (NEET MDS 2024) ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) బుధవారం వెల్లడించింది. డెంటల్ సర్జరీలో మాస్టర్స్ డిగ్రీ ప్రవేశాల కోసం నీట్ ఎండీఎస్ (NEET MDS) ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహిస్తుంది. 2024 లో ఈ పరీక్షను మార్చి 18వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 3వ తేదీన ప్రకటించారు.
ఈ వెబ్ సైట్స్ లో..
అభ్యర్థులు తమ స్కోర్లతో పాటు నీట్ ఎండీఎస్ 2024 ర్యాంకును nbe.edu.in వెబ్ సైట్ లో కానీ, లేదా natboard.edu.in వెబ్ సైట్ లో కానీ చెక్ చేసుకోవచ్చు. ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి వివిధ కేటగిరీలకు కటాఫ్ మార్కులతో పాటు కనీస అర్హత ప్రమాణాలను కూడా ఎన్బీఈఎంఎస్ (NBEMS) ఆయా వెబ్ సైట్ లలో పేర్కొంది.
ఇవే కటాఫ్ మార్క్స్
ఎన్బీఈఎంఎస్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కటాఫ్ స్కోరు (960కి) 263. అలాగే, ఆ కేటగిరీ వారికి కనీస అర్హత 50 % పర్సంటైల్. అదేవిధంగా ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ కేటగిరీకి కనీస అర్హత 40% పర్సంటైల్. ఆ కేటగిరీల వారికి కటాఫ్ స్కోరు (960కి) 230. అలాగే, జనరల్ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి కనీస అర్హత 45 శాతం పర్సంటైల్ కాగా, కటాఫ్ స్కోరు (960కి) 246.
ఏప్రిల్ 12 తరువాత..
అభ్యర్థులు తమ NEET MDS 2024 వ్యక్తిగత స్కోర్ కార్డును అధికారిక నీట్ ఎండీఎస్ వెబ్సైట్ నుంచి ఏప్రిల్ 12, 2024 తర్వాత nbe.edu.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆలిండియా 50% కోటా సీట్లకు మెరిట్ పొజిషన్ ను వేర్వేరుగా ప్రకటిస్తామని ఎన్ బీఈఎంఎస్ ప్రకటించింది.