NEET MDS, PG Results 2023: నీట్ పీజీ, నీట్ ఎండీఎస్ ఫలితాల వెల్లడి; కటాఫ్ మార్క్స్ ఇవే..
NEET MDS, PG Results 2023: నీట్ పీజీ, ఎండీఎస్ 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు natboard.edu.in. వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
NEET MDS, PG Results 2023: నీట్ పీజీ (NEET PG), ఎండీఎస్ (NEET MDS) 2023 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు natboard.edu.in. వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
NEET MDS, PG score cards: వెబ్ సైట్ లో అందుబాటులో..
నీట్ ఎండీఎస్, పీజీ (NEET MDS, PG) ఫలితాలను శనివారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) విడుదల చేసింది. ఫలితాలతో పాటు స్కోర్ కార్డ్స్, 50% ఏఐక్యూ కటాఫ్ మార్క్స్ ను కూడా వెల్లడించింది. ఈ వివరాలను నీట్ పీజీ (NEET PG) లేదా నీట్ ఎండీఎస్ (NEET MDS) రాసిన విద్యార్థులు natboard.edu.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా 50% కోటా ఎండీఎస్ కోర్సుల్లో, ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశానికి (2023-24 admission session) సంబంధించిన మెరిట్ లిస్ట్ ను విడుదల చేసినట్లు NBEMS వెల్లడించింది. నీట్ ఎండీఎస్ పరీక్ష రాసిన విద్యార్థుల వ్యక్తిగత స్కోర్ కార్డ్స్ జూన్ 26వ తేదీ నుంచి, నీట్ పీజీ రాసిన విద్యార్థుల వ్యక్తిగత స్కోర్ కార్డ్స్ జూన్ 28 నుంచి డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా natboard.edu.in. వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.
cut off marks: కటాఫ్ మార్క్స్ ఇవే..
- నీట్ పీజీ 50% ఏఐక్యూ కి, జనరల్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కటాఫ్ మార్క్స్ మొత్తం 800 మార్కులకు గానూ 291 మార్కులు.
- నీట్ ఎండీఎస్ కి, జనరల్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కటాఫ్ మార్క్స్ మొత్తం 960 మార్కులకు గానూ 272 మార్కులు.
- నీట్ పీజీ 50% ఏఐక్యూ కి, జనరల్ దివ్యాంగ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్క్స్ మొత్తం 800 మార్కులకు గానూ 274 మార్కులు.
- నీట్ ఎండీఎస్ కి, జనరల్ దివ్యాంగ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్క్స్ మొత్తం 960 మార్కులకు గానూ 255 మార్కులు.
- నీట్ పీజీ 50% ఏఐక్యూ కి,, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్క్స్ మొత్తం 800 మార్కులకు గానూ 257 మార్కులు.
- నీట్ ఎండీఎస్ కి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్ మార్క్స్ మొత్తం 960 మార్కులకు గానూ 238 మార్కులు.
- ఈ కటాఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన విద్యార్థులు తమ తమ కేటగిరీల్లో 50% ఆల్ ఇండియా కోటా లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ కు హాజరుకావాల్సి ఉంటుంది.