RPF Notification 2024 : నిరుద్యోగులకు శుభవార్త- 4,660 ఆర్పీఎఫ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..-rrb rpf notification 2024 apply for 4660 si constable posts from today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rpf Notification 2024 : నిరుద్యోగులకు శుభవార్త- 4,660 ఆర్పీఎఫ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..

RPF Notification 2024 : నిరుద్యోగులకు శుభవార్త- 4,660 ఆర్పీఎఫ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..

Sharath Chitturi HT Telugu
Apr 17, 2024 10:10 AM IST

RPF notification 2024 apply online : ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్​ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ నేడు మొదలువుతుంది. పూర్తి వివరాలు..

ఆర్​ఆర్బీ ఆర్పీఎప్​ రిక్రూట్​మెంట్​ 2024 వివరాలు..
ఆర్​ఆర్బీ ఆర్పీఎప్​ రిక్రూట్​మెంట్​ 2024 వివరాలు.. (Representational Image: Unsplash/Adhirej J R Nair)

RPF notification 2024 apply : నిరుద్యోగులకు శుభవార్త ఇచ్చింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు! రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్​లో 452 సబ్​ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల ఖాళీలకు ఆర్పీఎఫ్ 01/2024, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్​లో 4,208 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీలకు ఆర్పీఎఫ్ 02/2024 నోటిఫికేషన్లను.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్​ఆర్​బీ) విడుదల చేసింది. ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ప్రక్రియ సంబంధిత ఆర్​ఆర్​బీకి చెందిన అధికారిక వెబ్​సైట్​ లో ఏప్రిల్ 15న ప్రారంభమవుతుంది.

ఆర్పీఎఫ్ ఎస్ఐ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 14 వరకు గడువు ఉంది. దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో 2024 మే 15 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024: వయోపరిమితి

RPF notification 2024 apply online last date : కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు:- 2024 జూలై 1 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్ఐ పోస్టులు:- 2024 జూలై 1 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిర్దేశిత పరిమితికి మించి.. వయోపరిమితిలో ఈసారి 3 సంవత్సరాల వన్​టైమ్​ రిలాక్సేషన్​ని ఇచ్చారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మరింత సడలింపు వర్తిస్తుంది.

ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024: విద్యార్హతలు

కానిస్టేబుల్ ఖాళీలకు అభ్యర్థులు.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఐ పోస్టులకు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

RPF notification 2024 last date : క్వాలిఫయింగ్​ పరీక్షలకు హాజరై.. ఫలితాలు ప్రకటించని వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని ఆర్​ఆర్​బీ నోటిఫికేషన్​ 2024లో పేర్కొన్నారు.

ఆర్​ఆర్​బీ ఆర్పీఎఫ్ ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024: దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా, మైనార్టీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) అభ్యర్థులు మినహా అన్ని పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.500. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు హాజరైన తర్వాత ఫీజులో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఆర్​ఆర్​బీ రిక్రూట్​మెంట్​ 2024 నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

ఎక్కడ దరఖాస్తు చేయాలి?

RPF notification 2024 syllabus : దరఖాస్తుదారులు తమ ఫారాలను ఆర్​ఆర్​బీల సంబంధిత వెబ్​సైట్లలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ జాబితా ఇలా ఉంది.

ఆర్​ఆర్బీ ఆర్పీఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024
ఆర్​ఆర్బీ ఆర్పీఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024 (exam notification)

యూపీఎస్సీలో ఉద్యోగాలు- నోటిఫికేషన్​తో పాటు ఇతర వివరాలు..

UPSC Recruitment 2024 apply online : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు.. upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యూపీఎస్సీ రిక్రూట్​మెంట్ 2024 డ్రైవ్ ద్వారా.. సంస్థలోని 109 పోస్టులను భర్తీ చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం