UPSC Recruitment 2024 : యూపీఎస్సీలో ఉద్యోగాలు- నోటిఫికేషన్తో పాటు ఇతర వివరాలు..
UPSC Recruitment 2024 notification : యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2024 డ్రైవ్ మొదలైంది. ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితితో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
UPSC Recruitment 2024 apply online : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది. అర్హులైన అభ్యర్థులు.. upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2024 డ్రైవ్ ద్వారా.. సంస్థలోని 109 పోస్టులను భర్తీ చేయనుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 మే 2024 అని గుర్తుపెట్టుకోవాలి. అర్హత, ఖాళీల వివరాలు, ఇతర సమాచారం కోసం కింద చదవండి..
యూపీఎస్సీ రిక్రూట్మెట్ 2024- వివరాలు..
- పోస్టులు:- సైంటిస్ట్ -బీ: 3 పోస్టులు
- స్పెషలిస్ట్ గ్రేడ్ -3 అసిస్టెంట్ ప్రొఫెసర్ : 42 పోస్టులు
- ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ -1: 2 పోస్టులు
- UPSC Recruitment 2024 notification : అసిస్టెంట్ కెమిస్ట్ : 3 పోస్టులు
- నాటికల్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ : 6 పోస్టులు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : 13
- పోస్టులు మెడికల్ ఆఫీసర్ : 40 పోస్టులు
UPSC Recruitment 2024 last date to apply : పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. విద్యార్హత, వయోపరిమితి వివరాలు తెలుసుకునేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ని చూడాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చూడండి:- UPSC CDS 2024 Admit Card: యూపీఎస్సీ సీడీఎస్ 2024 అడ్మిట్ కార్డ్స్ విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
దరఖాస్తు ఫీజు..
UPSC Recruitment 2024 : యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2024 డ్రైవ్లో పాల్గొంటున్న అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందిన మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు మినహా) రూ.25/- (రూ.25) రుసుమును ఎస్బీఐ ఏదైనా శాఖలో నగదు రూపంలో లేదా ఏదైనా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా లేదా వీసా / మాస్టర్ / రూపే / క్రెడిట్ / డెబిట్ కార్డు / యూపీఐ చెల్లింపును ఉపయోగించడం ద్వారా మాత్రమే చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ని చూడవచ్చు. మరింత క్లారిటీ వస్తుంది.
ఎన్పీసీఐఎల్లో రిక్రూట్మెంట్..
NPCIL Recruitment 2024 ఛ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గేట్ 2022 లేదా గేట్ 2023 లేదా గేట్ 2024 స్కోర్ ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్పీసీఐఎల్ అధికారిక వెబ్సైట్ npcilcareers.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 10న ప్రారంభమైంది. 2024 ఏప్రిల్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (Executive Trainee) పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం