RPF Recruitment 2024 : 2వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్​ఆర్​బీ నోటిఫికేషన్​..-rpf recruitment exam 2024 check eligibility for 2 250 constable si posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rpf Recruitment 2024 : 2వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్​ఆర్​బీ నోటిఫికేషన్​..

RPF Recruitment 2024 : 2వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్​ఆర్​బీ నోటిఫికేషన్​..

Sharath Chitturi HT Telugu
Jan 04, 2024 01:40 PM IST

RPF Recruitment 2024 : 2వేలకుపైగా పోస్టుల భర్తీకి ఆర్​ఆర్​బీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

2వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్​ఆర్​బీ నోటిఫికేషన్​..
2వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆర్​ఆర్​బీ నోటిఫికేషన్​..

RPF Recruitment 2024 : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్​పీఎఫ్​), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్​పీఎస్​ఎఫ్​)లలో కానిస్టేబుల్​(ఎక్స్ఈ), సబ్ ఇన్​స్పెక్టర్​(ఎక్స్ఈ) నియామకాలను ప్రారంభించింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్​ఆర్​బీ). ఈ మేరకు ఓ నోటిఫికేషన్​ని విడుదల చేసింది.

అర్హత, ఎంపిక విధానం, పరీక్షలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ నోటిఫికేషన్​లో తెలుసుకోవచ్చు. ఈ దఫా రిక్రూట్​మెంట్​లో 2000 కానిస్టేబుల్, 250 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాలని చేయనుంది ఆర్​ఆర్​బీ. పురుషులు, మహిళలు.. ఆర్​పీఎఫ్​ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవచచు.

ఆర్​పీఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024 అధికారిక లింక్

rpf.indianrailways.gov.in అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి ఆర్​పీఎఫ్​ రిక్రూట్​మెంట్​కి సంబంధించిన నోటిఫికేషన్​ని తెలుసుకోవచ్చు. రిక్రూట్​మెంట్​కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హత, వయోపరిమితి, విద్యార్హతలు, దరఖాస్తు ఫీజు, పరీక్ష తేదీలు, దరఖాస్తు ప్రక్రియ వంటి ముఖ్యమైన వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచారు.

ఆర్​పీఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024 వివరాలు..

RPF Recruitment 2024 ally online : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటివి సెలక్షన్​ ప్రక్రియలో ఉంటాయి.

ఎస్ రైల్వే, ఎస్డబ్ల్యు రైల్వే, ఎస్సీ రైల్వే, సి రైల్వే, డబ్ల్యు రైల్వే, డబ్ల్యు రైల్వే, డబ్ల్యుసి రైల్వే, ఎస్ఇసి రైల్వే, ఇ రైల్వే, ఇసి రైల్వే, ఎస్ఇ రైల్వే, ఇకో రైల్వే, ఎన్ రైల్వే, ఎన్ఇ రైల్వే, ఎన్డబ్ల్యు రైల్వే, ఎన్సి రైల్వే, ఎన్ఎఫ్ రైల్వే మరియు ఆర్పిఎస్ఎఫ్తో సహా వివిధ గ్రూపులకు సిబీటీ వేర్వేరుగా ఉంటుంది.

ఆర్​పీఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024 ఫీజు..

జనరల్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా, మాజీ సైనికోద్యోగులు, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.250 అప్లికేషన్ ఫీజు తగ్గించారు.

RPF Recruitment 2024 notification : కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల కోసం ఆర్​పీఎఫ్​ రిక్రూట్మెంట్ 2024కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన బోర్డు, విశ్వవిద్యాలయం నుంచి 10 లేదా 12, డిప్లొమా లేదా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

కానిస్టేబుల్ పోస్టుకు 18 ఏళ్లు, ఆర్​పీఎఫ్​ ఎస్ఐ పోస్టులకు 20 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయోపరిమితి పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితి ఆంక్షలు ఉంటాయని గమనించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం