Railway Protection Force Jobs: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) లో 4,660 కానిస్టేబుళ్లు, ఎస్ఐ (Sub-Inspectors) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 న ప్రారంభమవుతుంది. ఆర్ఆర్బీ (RRB) ఆర్పీఎఫ్ (RPF) రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తుకు చివరి తేదీ మే 14 వ తేదీ. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్ సైట్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,660 కానిస్టేబుళ్లు, ఎస్ ఐ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్ట్ లకు అప్లై చేసే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ .500 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ, మాజీ సైనికులు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF Recruitment) లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుకు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లో సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు 7వ ఓపీసీ ప్రకారం పే మ్యాట్రిక్స్ లోని లెవల్ 6 నెలవారీ వేతనం ఇస్తారు. కానిస్టేబుల్ పోస్టుకు 7వ సీపీసీ ప్రకారం పే మ్యాట్రిక్స్ లోని లెవల్ 3 నెలవారీ పే స్కేల్ ఇస్తారు.