IIT placements down : ఐఐటీల్లో ఐటీ​ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్​- జాబ్​ ఆఫర్స్​ 30శాతం డౌన్​!-iit students worried as job offers decline by 30 percent this year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iit Placements Down : ఐఐటీల్లో ఐటీ​ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్​- జాబ్​ ఆఫర్స్​ 30శాతం డౌన్​!

IIT placements down : ఐఐటీల్లో ఐటీ​ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్​- జాబ్​ ఆఫర్స్​ 30శాతం డౌన్​!

Sharath Chitturi HT Telugu
Dec 10, 2023 12:45 PM IST

IIT placements down 2023 : ఈ ఏడాదిలో ఇప్పటివరకు.. ఐఐటీల్లో ఉద్యోగాలు 30శాతం తగ్గిపోయాయి! కంప్యూటర్​ సైన్స్​, ఐటీ ఉద్యోగులకు కూడా జాబ్​ ఆఫర్స్​ రావడం లేదని తెలుస్తోంది.

 ఐఐటీల్లో జాబ్​ ఆఫర్స్​ 30శాతం డౌన్​!
ఐఐటీల్లో జాబ్​ ఆఫర్స్​ 30శాతం డౌన్​!

IIT placements down 2023 : దేశంలోని ఐఐటీ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది! గత అకాడమిక్​ సెషన్​తో పోల్చుకుంటే.. ఈసారి, ఇప్పటివరకు 30శాతం తక్కువగా జాబ్​ ఆఫర్స్​ రావడం ఇందుకు కారణమని ఓ నివేదిక పేర్కొంది.

సీఎస్​ఈ విద్యార్థులకు కూడా ఉద్యోగాల్లేవ్​..!

సాధారణంగా.. ప్లేస్​మెంట్స్​లో కంప్యూటర్​ సైన్స్​ విద్యార్థులకు మంచి డిమాండ్​ ఉంటుంది. నివేదిక ప్రకారం.. ఈసారి.. వారికి కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ప్లేస్​మెంట్​ డ్రైవ్​ మొదలైన తర్వాత.. వారం, అంతకన్నా ఎక్కువ రోజులపాటు ఒక్క సీఎస్​ఈ విద్యార్థికి కూడా ఉద్యోగం రాకపోవడం ఇదే తొలిసారి!

ఇండియాలో ప్లేస్​మెంట్స్​ విషయాల్లో ఐఐటీలు ఒక స్టాండర్డ్​ని​ సెట్​ చేస్తాయి. వీటిల్లో చదువుకునే విద్యార్థులు.. భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు కొడతారు. అలాంటిది.. ఈసారి పరిస్థితి ఈ విధంగా ఉండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం.

IIT Students placements : గతేడాది కూడా ఐఐటీ దిల్లీ, బాంబే, కాన్పూర్​, మద్రాస్​, రూర్​ఖీ, గౌహతి, వారణాసి (బీహెచ్​యూ), ఖరగ్​పూర్​ల్లో ప్లేస్​మెంట్స్​ డ్రైవ్​ బాగానే జరిగిది. వేలాది మంది విద్యార్థులు పోటీపడి.. ఉద్యోగాలు సంపాదించుకున్నారు. టెక్​ ప్రపంచం నెమ్మదించినా.. ఐటీ విద్యార్థులకు మాత్రం మంచి ఉద్యోగాలే వచ్చాయి.

కానీ ఈసారి.. వీరందరికి కష్టకాలం ఎదురవుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. టెక్​ ప్రపంచం నెమ్మదించిన ఎఫెక్ట్​ ఇప్పుడు కనిపిస్తోందని తెలుస్తోంది. చాలా సంస్థలు ఈసారి ప్లేస్​మెంట్స్​కి దూరంగా ఉంటున్నాయట.

IIT latest news : "గతేడాది వరకు.. 10 మంది విద్యార్థులను ఎంచుకునే రిక్రూటర్స్​.. ఇప్పుడు 1-2 ఇద్దరికే జాబ్​ ఆఫర్స్​ ఇస్తున్నారు. కొన్ని సంస్థలైతే.. విద్యార్థులను తీసుకోకుండానే వెళ్లిపోతున్నాయి," అని ఐఐటీ ఖరగ్​పూర్​లో చదువుకుంటున్న విద్యార్థి చెప్పాడు.

ఐఐటీ ఖరగ్​పూర్​ కెరీర్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ప్రకారం.. 2023 డిసెంబర్​ 1న ఫైనల్​ ప్లేస్​మెంట్​ డ్రైవ్​ మొదలైంది. కాగా.. 7వ రోజు నాటికి ఈ వర్సిటీలో 1,181 జాబ్​ ఆఫర్స్​ వచ్చాయి. గతేడాది జరిగిన ప్లేస్​మెంట్​ డ్రైవ్​లో.. ఐదో రోజుకే 1,300కుపైగా ఆఫర్స్​ లభించడం గమనార్హం.

IIT placements latest news : మరోవైపు ఐఐటీ- బీహెచ్​యూలో శుక్రవారం ఉదయం నాటికి 850 జాబ్​ ఆఫర్స్​ మాత్రమే వచ్చాయి. గతేడాది తొలి నాలుగు రోజుల్లోనే 1000కుపైగా జాబ్​ ఆఫర్స్​ లభించాయి.

మరి రానున్న రోజుల్లో.. ఐఐటీలో ప్లేస్​మెంట్స్​ పుంజుకుంటాయో లేదో చూడాలి!

Whats_app_banner

సంబంధిత కథనం