Cracked IIT-JEE at 13: 13 ఏళ్లకే ఐఐటీ లో సీట్, 24 ఏళ్లకే యాపిల్ లో జాబ్ కొట్టిన రైతు బిడ్డ.. తన లక్ష్యం ఏంటంటే..?-bihars prodigy son of a farmer cracked iit jee at 13 employed by apple at 24 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cracked Iit-jee At 13: 13 ఏళ్లకే ఐఐటీ లో సీట్, 24 ఏళ్లకే యాపిల్ లో జాబ్ కొట్టిన రైతు బిడ్డ.. తన లక్ష్యం ఏంటంటే..?

Cracked IIT-JEE at 13: 13 ఏళ్లకే ఐఐటీ లో సీట్, 24 ఏళ్లకే యాపిల్ లో జాబ్ కొట్టిన రైతు బిడ్డ.. తన లక్ష్యం ఏంటంటే..?

HT Telugu Desk HT Telugu
Nov 14, 2023 08:20 PM IST

Cracked IIT-JEE at 13: బిహార్ కు చెందిన రైతు బిడ్డ, బాల మేథావి సత్యం కుమార్. చిన్నప్పటి నుంచే చదువుల్లో అత్యంత చురుగ్గా ఉండేవాడు. 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ (IIT-JEE) లో 679 ర్యాంక్ సాధించి, రికార్డు సృష్టించాడు.

బాల మేథావి సత్యం కుమార్
బాల మేథావి సత్యం కుమార్ (Photo: Linkedin.com)

Bihar’s prodigy: బిహార్ లోని భోజ్ పూర్ జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో సత్యం కుమార్ (Satyam Kumar) జన్మించాడు. చిన్న వయస్సు నుంచే అపారమైన తెలివితేటలను చూపేవాడు. ప్రస్తుతం యూఎస్ లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నాడు. అతడి స్ఫూర్తిదాయక జీవన చిత్రం.. చిల్డ్రన్స్ డే (children's day) సందర్భంగా..

2012లోనే..

సత్యం కుమార్ 2012 లో, అంటే 12 ఏళ్ల వయస్సులోనే ఐఐటీ జేఈఈ ( Indian Institute of Technology-Joint Entrance Examination - IIT-JEE)లో ర్యాంక్ సంపాదించాడు. కానీ, ఆ ర్యాంక్ 8 వేల పైచిలుకు ఉండడంతో, నెక్స్ట్ ఈయర్ మళ్లీ రాద్దామని డిసైడ్ అయ్యాడు. 2013 లో మళ్లీ ఐఐటీ జేఈఈ (IIT-JEE) రాశాడు. ఈ సారి 679 ర్యాంక్ వచ్చింది. ఐఐటీ కాన్పూర్ లో అడ్మిషన్ తీసుకున్నాడు. అంటే, 13 ఏళ్ల చిన్న వయస్సులోనే ఐఐటీలో జాయిన్ అయ్యాడు. అంతకుముందు, అత్యంత చిన్న వయస్సులో ఐఐటీ లో అడ్మిషన్ సంపాదించిన రికార్డు ఢిల్లీకి చెందిన సాహల్ కౌషిక్ పేరుపై ఉంది. 14 ఏళ్ల వయస్సులో సాహల్ కౌషిక్ ఐఐటీ లో అడ్మిషన్ సంపాదించాడు. ఆ రికార్డును సత్యం కుమార్ బద్ధలు కొట్టాడు.

టెక్సస్ యూనివర్సిటీలో..

ఆ తరువాత కాన్పూర్ ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీ టెక్ - ఎంటెక్ కంబైన్డ్ కోర్సును 2018 లో సత్యం కుమార్ పూర్తి చేశాడు. ఆ తరువాత, పీహెచ్ డీ చేయడం కోసం అమెరికాలోని ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన అక్కడ బ్రెయిన్ - మెషీన్ ఇంటర్ ఫేసెస్ (Brain-Machine Interfaces) సబ్జెక్టులో పీహెచ్ డీ చేస్తున్నాడు.

యాపిల్ లో ఇంటర్న్ షిప్

ఐఐటీ కాన్పూర్ లో ఉండగానే సత్యం కుమార్ “Electrooculogram based eye blink classification During EOG signal accuistion”, “Optimisation of electrode positions in Different Brain Computer Interfaces", and "Imaginative Speech based Brain-Computer Interface", అనే మూడు ప్రాజెక్టులపై వర్క్ చేశాడు. యూఎస్ వెళ్లిన తరువాత, 24 ఏళ్ల వయస్సులో యాపిల్ సంస్థలో మెషీన్ లెర్నింగ్ ఇంటర్న్ (machine learning intern) గా పని చేశాడు. అక్కడ ఆగస్ట్ 2023 వరకు ఇంటర్న్ షిప్ చేశాడు. ప్రస్తుతం, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ లో ‘బ్రెయిన్ - కంప్యూటర్ ఇంటర్ ఫేసెస్’ స్పెషలైజేషన్ తో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ (graduate research assistant) గా విధుల్లో ఉన్నాడు. తన స్వరాష్ట్రానికి తిరిగి వెళ్లి, అక్కడి పేద విద్యార్థులకు చదువు నేర్పించాలన్నది తన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

Whats_app_banner