IIT JAM 2024: ఐఐటీల్లో మాస్టర్స్ కు అవకాశం; ‘జామ్’ కు అప్లై చేసేందుకు లాస్ట్ డేట్ పొడగింపు
IIT JAM 2024: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ల్లో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లలో మాస్టర్ ఆఫ్ సైన్స్, ఇతర పోస్ట్-గ్రాడ్యుయేట్ సైన్స్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం ప్రతి సంవత్సరం జామ్ (JAM) ను నిర్వహిస్తారు.
IIT JAM 2024: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ (IIT), ఐఐఎస్సీ (IISc), ఎన్ఐటీ (NIT) ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ మరో అవకాశం కల్పిస్తోంది. ఆయా విద్యా సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (Joint Admission test for Masters - JAM) కు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 25 వరకు..
ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు అక్టోబర్ 25 లోపు ఆన్ లైన్ లో ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (Joint Admission test for Masters - JAM) అడ్మిషన్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకునే విద్యార్థులు పూర్తి వివరాల కోసం జామ్ అధికారిక వెబ్ సైట్ jam.iitm.ac.in. ను పరిశీలించాలి. jam.iitm.ac.in. ద్వారానే ఈ టెస్ట్ కు అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష నిర్వహణను వేర్వేరు విద్యా సంస్థలకు ఇస్తుంటారు. ఈ సంవత్సరం ఐఐటీ, మద్రాస్ ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ను నిర్వహిస్తోంది.
ఫిబ్రవరిలో పరీక్ష
ఈ సంవత్సరం ఈ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ - జామ్ (JAM) కు అప్లై చేసుకునే అవకాశం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కల్పించారు. అక్టోబర్ 20వ తేదీతో ముగిసిన లాస్ట్ డేట్ ను అక్టోబర్ 25 వరకు పొడిగించారు. అప్లై చేసిన విద్యార్థులకు అడ్మిట్ కార్డ్స్ జనవరి 8వ తేదీ నుంచి jam.iitm.ac.in. వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ జామ్ పరీక్ష 2024, ఫిబ్రవరి 11వ తేదీన జరుగుతుంది. ఫలితాలను మార్చి 22వ తేదీన ప్రకటిస్తారు. స్కోర్ కార్డ్స్ jam.iitm.ac.in. వెబ్ సైట్లో ఏప్రిల్ 2 వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి.
అర్హత..
ఈ పరీక్షకు అప్లై చేయడానికి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. డిగ్రీ ఫైనల్ ఈయర్ లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అడ్మిషన్ సమయానికి డిగ్రీ పూర్తియనట్లుగా సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
How to apply: అప్లై చేయడం ఎలా..
ఈ జామ్ పరీక్ష కు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ఐఐటీ జామ్ అధికారిక వెబ్ సైట్ jam.iitm.ac.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే IIT JAM 2024 registration లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి
- అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం ఒక హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.