IIT Zanzibar admissions: ఐఐటీ జాంజిబార్ లో అడ్మిషన్లు; ఎవరైనా అప్లై చేసుకోవచ్చు-iit madras invites applications for zanzibar campus admission ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iit Zanzibar Admissions: ఐఐటీ జాంజిబార్ లో అడ్మిషన్లు; ఎవరైనా అప్లై చేసుకోవచ్చు

IIT Zanzibar admissions: ఐఐటీ జాంజిబార్ లో అడ్మిషన్లు; ఎవరైనా అప్లై చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu
Aug 01, 2023 07:16 PM IST

IIT Zanzibar admissions: ఐఐటీ జాంజిబార్ లో అడ్మిషన్ల కోసం ఐఐటీ మద్రాసు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IIT Zanzibar admissions: ఐఐటీ జాంజిబార్ లో అడ్మిషన్ల కోసం ఐఐటీ మద్రాసు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఐఐటీ జాంజిబార్ లో అకడమిక్ ప్రొగ్రామ్స్ 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. అడ్మిషన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 5.

అన్ని దేశాల వారికి..

ఐఐటీ జాంజిబార్ లో డేటా సైన్సెస్ అండ్ ఏఐ (Data Science & AI) కోర్సులో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, డేటా సైన్సెస్ అండ్ ఏఐ (Data Science & AI) కోర్సులో రెండు సంవత్సరాల మాస్టర్ డిగ్రీ ల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. భారతీయులు సహా అన్ని దేశాల వారు ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందడానికి అర్హులు. డేటా సైన్సెస్, కృత్రిమ మేథకు సంబంధించి సమగ్రంగా కోర్సు మెటీరియల్ ను రూపొందించినట్లు ఐఐటీ మద్రాసు ప్రకటించింది. ఇక్కడ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఎక్స్చేంజ్ ప్రొగ్రామ్ కింద ఒక సెమిస్టర్ ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లోని యూనివర్సిటీలో చదివే అవకాశం కూడా లభిస్తుంది. ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్ షిప్ లభిస్తుంది. కోర్స్ రిక్వైర్ మెంట్స్ కు సంబంధించి చెన్నై లోని ఐఐటీ మద్రాసు సంపూర్ణ సహకారం అందిస్తుంది.

అప్లై చేయడం ఇలా..

ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఐఐటీ జాంజిబార్ లో అడ్మిషన్ కోసం zanzibar.iitm.ac.in వెబ్ సైట్ ద్వారా ఆగస్ట్ 5వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి డేటా సైన్సెస్ అండ్ ఏఐ (Data Science & AI) కోర్సులో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, డేటా సైన్సెస్ అండ్ ఏఐ (Data Science & AI) కోర్సులో రెండు సంవత్సరాల మాస్టర్ డిగ్రీ.. అనే రెండు కోర్సుల్లో మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ లో మాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అడ్మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం zanzibar@ge.iitm.ac.in కు మెయిల్ చేయవచ్చు. లేదా +91 90433 38564 నంబర్ కు వాట్సాప్ చేయవచ్చు.

WhatsApp channel

టాపిక్