Sobhita Shivanna : హైదరాబాద్ లో విషాదం, బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య-hyderabad kannada serial actress sobhita shivanna committed suicide ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sobhita Shivanna : హైదరాబాద్ లో విషాదం, బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

Sobhita Shivanna : హైదరాబాద్ లో విషాదం, బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

Bandaru Satyaprasad HT Telugu
Dec 01, 2024 08:19 PM IST

Serial Actress Sobhita Shivanna : కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని శ్రీరాంనగర్ కాలనీలోని తన ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో విషాదం, బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
హైదరాబాద్ లో విషాదం, బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య

Serial Actress Sobhita Shivanna : కన్నడ సీరియల్ నటి శోభిత(32) హైదరాబాద్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని ఉంటున్న ఆమె, తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శోభిత కన్నడ సీరియల్స్ బ్రహ్మగంతు, నినిదలేతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆమె గతేడాది వివాహం చేసుకున్నారు. శోభిత తన భర్త సుధీర్‌తో కలిసి శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. నటి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం శోభిత మృతదేహాన్ని బెంగళూరుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.

శోభిత భర్త హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. శోభిత శివన్న 12కి పైగా కన్నడ సీరియల్స్‌లో నటించారు. అందులో చిదపాట, మంగళగౌరి, కోగిలే, బ్రహ్మగంతు, కృష్ణ రుక్మిణి, మణెదేవ, దీపవు నిందే గుడ్గియు నిందే, అమ్మవారు కన్నడ సీరియల్స్‌లో నటించారు. రెండు మూడు కన్నడ సినిమాల్లో కూడా ఆమె నటించారు. అదేవిధంగా పలు ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరించారు. శోభిత శివన్నకు బ్రహ్మగంతు సీరియల్‌లోని నెగిటివ్ రోల్ మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె మే 22, 2023న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన సుధీర్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

శోభిత సూసైడ్ కు గల కారణాలు తెలియరాలేదు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పెళ్లి తర్వాత సీరియల్స్, సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు శోభిత. నటి ఆత్మహత్య వార్త విని శోభిత కుటుంబ సభ్యులు, సన్నిహితులు షాక్ కు గురయ్యారు. శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 18 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫొటోషూట్స్ ఫొటోలను, సీరియల్స్ పోస్టర్స్ను ఇన్ స్టాలో పంచుకునేవారు. శోభిత మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం