Sreeleela Thaman: తిరుమలలో శ్రీలీల చెంప గిల్లిన తమన్.. వీడియో వైరల్.. గుడిలో ఇదేం పనంటూ ట్రోలింగ్-sreeleela thaman visits tirumala video viral ss thaman touches sreeleela cheeks at tirumala temple netizens trolling ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela Thaman: తిరుమలలో శ్రీలీల చెంప గిల్లిన తమన్.. వీడియో వైరల్.. గుడిలో ఇదేం పనంటూ ట్రోలింగ్

Sreeleela Thaman: తిరుమలలో శ్రీలీల చెంప గిల్లిన తమన్.. వీడియో వైరల్.. గుడిలో ఇదేం పనంటూ ట్రోలింగ్

Sanjiv Kumar HT Telugu
Jun 26, 2024 10:44 AM IST

Sreeleela Thaman Visits Tirumala Video Viral: తిరుమల తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రంలో హీరోయిన్ శ్రీలీల చెంపను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఆప్యాయంగా గిల్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

తిరుమలలో శ్రీలీల చెంప గిల్లిన తమన్.. వీడియో వైరల్.. గుడిలో ఇదేం పనంటూ ట్రోలింగ్
తిరుమలలో శ్రీలీల చెంప గిల్లిన తమన్.. వీడియో వైరల్.. గుడిలో ఇదేం పనంటూ ట్రోలింగ్

Sreeleela Thaman In Tirumala: టాలీవుడ్ బ్యూటిఫుల్ అండ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు ఉన్న క్రేజ్ ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోయి సీనియర్ హీరోయిన్స్‌కు సైతం గట్టి పోటీ ఇచ్చింది ఈ భామ. గతేడాది నెలకో సినిమాను విడుదల చేసి ఏ హీరోయిన్ సాధించిన ఘనత సాధించింది.

కోలీవుడ్ ఎంట్రీ

వరుసగా ఆరు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందించింది ముద్దుగుమ్మ శ్రీలీల. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఆమె కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

బయటకు వెళ్తుండగా

హీరోయిన్ శ్రీలీల బుగ్గను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గిల్లడమే ఆ వీడియో వైరల్ అవడానికి కారణం. అయితే, తాజాగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శ్రీలీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. సందర్శానంతరం గుడి నుంచి బయటకు వెళ్తుండగా శ్రీలీలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తారసపడ్డారు.

నెటిజన్స్ ట్రోలింగ్

దాంతో ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. తనకున్న చనువుతో శ్రీలీల చెంపను మెల్లిగా తాకిన తమన్ అనంతరం ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఈ దృశ్యం మీడియా కెమెరాల్లో చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్స్ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు.

విభిన్న రకాలుగా

గుడిలో అదేం పని అంటూ తమన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. కొంతమంది సపోర్ట్‌గా మాట్లాడుతుంటే మరికొంతమంది నెగెటివ్‌గా కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఈ వీడియోతో శ్రీలీల తమన్ ఇద్దరూ టాపిక్‌గా మారారు. కాగా శ్రీలీల హీరోయిన్‌గా చేసిన పలు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే.

రవితేజతో మరోసారి

శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం మూడు సినిమాలకు తమన్ సంగీతం అందించారు. అలా వీరికి ఏర్పడిన చనువుతోనే ఆప్యాయంగా శ్రీలీల బుగ్గ గిల్లి ఉంటారని తెలుస్తోంది. ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమా చేస్తోంది. అలాగే రవితేజతో మరోసారి శ్రీలీల నటించనుంది.

రష్మిక మందన్నా ఛాన్స్

రవితేజ శ్రీలీల కాంబో మూవీ ధమాకా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి ఈ జోడీ రిపీట్ కానుండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఇక రాబిన్ హుడ్ సినిమాలో ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను అనుకున్నారు. కానీ, పలు అనూహ్య కారణాలతో రష్మిక తప్పుకుంది. ఆమె ఛాన్స్ శ్రీలీలను వరించింది.

బ్రాండ్ అంబాసిడర్‌గా

కాగా సినిమాలతోనే కాకుండా ముద్దుగుమ్మ శ్రీలీల పలు బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఇటీవలే న్యూడ్ స్కిన్ కేర్ హై గ్లేజరిన్ బ్రాండ్‌కు శ్రీలీల ప్రచారకర్తగా ఎంపిక అయింది. పాల ఉత్పత్తులతో తయారు చేసే న్యూడ్ ప్రొడక్ట్స్ తనకు చాలా ఇష్టమని శ్రీలీల చెప్పుకొచ్చింది.

WhatsApp channel