Ashu Reddy: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి అషురెడ్డి హీరోయిన్‌గా సినిమా.. జబర్దస్త్ కమెడియన్స్‌తో ఈవెంట్-bigg boss ashu reddy padmavyuham lo chakradhari pre release event with jabardasth comedians doctors in rayachoti ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ashu Reddy: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి అషురెడ్డి హీరోయిన్‌గా సినిమా.. జబర్దస్త్ కమెడియన్స్‌తో ఈవెంట్

Ashu Reddy: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి అషురెడ్డి హీరోయిన్‌గా సినిమా.. జబర్దస్త్ కమెడియన్స్‌తో ఈవెంట్

Sanjiv Kumar HT Telugu
Jun 21, 2024 12:37 PM IST

Ashu Reddy Padmavyuham Lo Chakradhari Pre Release Event: బిగ్ బాస్ బోల్డ్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి హీరోయిన్‌గా నటించిన మరో సినిమా పద్మవ్యూహంలో చక్రధారి. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జబర్దస్త్ కమెడియన్స్, డాక్టర్ల మధ్య రాయచోటిలో నిర్వహించారు.

బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి అషురెడ్డి హీరోయిన్‌గా సినిమా.. జబర్దస్త్ కమెడియన్స్‌తో ఈవెంట్
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటి అషురెడ్డి హీరోయిన్‌గా సినిమా.. జబర్దస్త్ కమెడియన్స్‌తో ఈవెంట్

Padmavyuham Lo Chakradhari Pre Release Event: బ్యూటిఫుల్ అషు రెడ్డి బిగ్ బాస్ ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పార్టిస్‌పేట్ చేసిన అషు రెడ్డి తనదైన తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. బోల్డ్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓటీటీ సీజన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొని అలరించింది ఈ ముద్దుగుమ్మ అషు రెడ్డి.

మొన్నటివరకు అమెరికాలో ఉన్న అషు రెడ్డి ఈ మధ్య వరుస సినిమాలతో అలరిస్తోంది. ఫోకస్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన అషు రెడ్డి ఇటీవలే యేవమ్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా అషు రెడ్డి హీరోయిన్‌గా నటించిన సినిమా పద్మవ్యూహంలో చక్రధారి.

పద్మవ్యూహంలో చక్రధారి సినిమా వీసీ క్రియేషన్స్ బ్యానర్‌పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోంది . ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా, శశికా టిక్కూ, అషురెడ్డి హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇవాళ అంటే జూన్ 21న థియేటర్లలో విడుదలైంది. సినిమా రిలీజ్ కంటే ముందు ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటిలో ప్రముఖులు, ముఖ్య అతిథిలు మధ్య చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మూవీ కాస్ట్ అండ్ క్రూతో పాటు జబర్దస్త్ నటీనటులు వినోదిని, పంచ్ ప్రసాద్, నాగిరెడ్డి, ఫణి, ఉప్పల్ బాలు, శాన్వి, సత్తి, రేలారే రేలా గోపాల్ పాల్గొని సందడి చేశారు. వీరితో పాటు రాయచోటిలో ఉన్న ప్రముఖ డాక్టర్లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

పాటలు, జబర్దస్త్ కమెడియన్ల ఫన్నీ స్కిట్స్‌, కేరింతలతో పద్మవ్యూహంలో చక్రధారి ప్రీ రిలీజ్ వేడుక ఆద్యంతం ఉర్రూతలూగింది. ఈ వేడుకకు వచ్చిన ప్రేక్షకులకు విశేషంగా వినోదం అందించింది. ఈ కార్యక్రమంలో రాయచోటికి చెందిన డాక్టర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న పద్మవ్యూహంలో చక్రధారి సినిమా పెద్ద హిట్ అవుతుందని డాక్టర్స్ పేర్కొన్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో రాయచోటి నుంచి ఇద్దరు హీరోలు ఉన్నారని, యూత్ ఫుల్ సినిమాలతో అలరించే కిరణ్ అబ్బవరం ఈ ప్రాంతం వాడే అని, అలాగే ఈ సినిమా హీరో ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ కూడా ఇదే ప్రాంతం వాడు అయినందుకు ఎంతో సంతోషిస్తున్నట్లు వారు తెలిపారు.

ప్రవీణ్ రాజ్‌కుమార్ సైతం కిరణ్ అబ్బవరం అంత గొప్ప పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నామని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. జూన్ 21 అందరూ పద్మవ్యూహంలో చక్రధారి చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.

కాగా, ఇదివరకే విడుదలైన పద్మవ్యూహంలో చక్రధారి ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ట్రైలర్ చాలా బాగుండడంతో ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

పద్మవ్యూహంలో చక్రధారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జబర్దస్త్ కమెడియిన్లు
పద్మవ్యూహంలో చక్రధారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జబర్దస్త్ కమెడియిన్లు
WhatsApp channel