Kiran Abbavaram Engagement: గ్రాండ్‍గా హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం
Kiran Abbavaram - Rahasya Gorak Engagement: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్‍మెంట్ గ్రాండ్‍గా జరిగింది. నటి రహస్య గోరక్‍ను ఆయన పెళ్లాడనున్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి.
Kiran Abbavaram Engagement: తెలుగు యువ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరక్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‍లోని ఓ రిసార్టులో నేడు (మార్చి 13) వీరి ఎంగేజ్‍మెంట్ గ్రాండ్‍గా జరిగింది. తన తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’ హీరోయిన్ రహస్య గోరక్‍నే కిరణ్ పెళ్లాడనున్నారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కిరణ్, రహస్య నేడు ఉంగరాలు మార్చుకున్నారు.

ఎంగేజ్‍మెంట్ కోసం లైట్ పింక్ కలర్ కుర్తా ధరించారు కిరణ్ అబ్బవరం. పీచ్ కలర్ చీరను రహస్య ధరించారు. ఇద్దరూ చూడముచ్చటగా కనిపించారు. ఇద్దరూ పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. దండలు వేసుకున్నారు.
కిరణ్ అబ్బవరం, రహస్య ఎంగేజ్‍మెంట్‍కు ఇరు కుటుంబాల, సభ్యులు సన్నిహితులు, హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి కొందరు సెలెబ్రిటీలు కూడా వచ్చారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. . సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది విషెస్ చెబుతున్నారు.
అప్పటి నుంచే ప్రేమ
2019లో ‘రాజావారు రాణిగారు’తో సినిమాల్లో తెరంగేట్రం చేశారు కిరణ్ అబ్బవరం. ఆ చిత్రంలో రహస్య గోరక్ హీరోయిన్‍గా నచించారు. ఈ చిత్రం మంచి హిట్ అయింది. కిరణ్‍కు తొలి చిత్రంతోనే మంచి పేరు వచ్చింది. అయితే, ఈ మూవీ సమయంలోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారు. వీరి లవ్ జర్నీ అప్పుడే మొదలైంది.
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ డేటింగ్‍లో ఉన్నారని చాలా కాలంగా రూమర్లు వస్తునే ఉన్నాయి. అయితే, ఇద్దరూ మౌనం పాటిస్తూ వచ్చారు. రూమర్లపై స్పందించలేదు. అయితే, గతేడాది ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం దొరికిపోయారు. రహస్యతో ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పారు. ఆమె పేరు చెప్పగానే సిగ్గు పడ్డారు. దొరికిపోయానని తనకు తానే చెప్పారు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అలాగే, రహస్యతో ఆయన ప్రేమలో ఉన్నారని కన్ఫార్మ్ అయింది.
ఆగస్టులో పెళ్లి?
సుమారు ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నేడు నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, ఆగస్టులో వివాహం చేసుకోవాలని వీరు ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్‍లో వివాహ రిసెప్షన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఓ చిత్రం చేస్తున్నారు. ఆగస్టులోగానే ఆ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకునే ఛాన్స్ ఉంది.
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఫ్లాఫ్‍ల బాటలో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన మూడు సినిమాలు గతేడాది వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా నిలిచాయి. వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ చతికిలపడ్డాయి. అంచనాలకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోయాయి. రూల్స్ రంజన్ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. మంచి బజ్ మధ్యే రిలీజ్ అయినా.. ఈ మూవీ బోల్తా కొట్టింది.