Payal Rajput Rakshana: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్-payal rajput crime investigation thriller rakshana title first look released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Payal Rajput Rakshana: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్

Payal Rajput Rakshana: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్

Sanjiv Kumar HT Telugu
May 12, 2024 02:54 PM IST

Payal Rajput Crime Investigation Thriller Rakshana: బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రక్షణ మూవీతో వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ పవర్‌ఫుల్ పోలీస్‌గా నటిస్తోంది.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తోన్న బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్

Payal Rajput Rakshana Title First Look: ‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాలోనే డిఫరెంట్ రోల్ ప్లే చేసి బోల్డ్ బ్యూటి అనిపించుకుంది పాయల్ రాజ్‌పుత్. ఇక ఇటీవల వచ్చిన మంగళవారం సినిమాలో నటనతో ప్రశంసలు అందుకుంది.

అంతేకాకుండా జైపూర్ ఫిలీం పెస్టివల్‌లో మంగళవారం సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డ్ సైతం అందుకుంది. ఇప్పుడు మరో కొత్త రోల్ పోషిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది. పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ర‌క్ష‌ణ‌. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు ఇతర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించనుంది.

ప్రస్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా రూపొందుతోంది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌.

తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం క‌ట్టిప‌డేయ‌నున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా పాయ‌ల్‌ మెప్పించ‌బోతున్నారు.

రక్షణ టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ తన అభిప్రాయం చెప్పారు. "ర‌క్ష‌ణ ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది" అని డైరెక్టర్ ప్రణదీప్ ఠాకోర్ తెలిపారు.

"ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని రక్షణ దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ పేర్కొన్నారు.

రక్షణ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్‌‌తో పాటు రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఛాయాగ్రహణం అనిల్ బండారి, సంగీతం మహతి స్వ‌ర‌ సాగర్, సౌండ్ డిజైనర్ జె.ఆర్. ఎతిరాజ్, ఎడిటర్ గ్యారి బి హెచ్, స్టంట్స్ వెంకట్ మాస్టర్, ప్రొడక్షన్ డిజైన్ రాజీవ్ నాయర్, రైటర్ తయనిధి శివకుమార్, స్టిల్స్ ఎ. దాస్, పబ్లిసిటీ డిజైనర్ రమాకాంత్, వీఎఫ్ఎక్స్ అలగర్‌సామి, మయాన్- ప్రదీప్ పుడి బాధ్యతలు చేపట్టారు.

అలాగే.. కోడైరెక్టర్‌గా రాఘవేంద్ర శ్రీనివాస, పీరీఓగా నాయుడు సురేంద్రకుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా శరద్ వాఘ్రే, ప్రొడక్షన్ కంట్రోలర్‌గా శ్రీనివాస్ కమ్మెల, కాస్ట్యూమ్స్ శ్రీను కనుమోలు, మేకప్ కోటి లకావత్ చేశారు.