Allu Arjun: పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. అసలు విషయం ఏంటంటే?-allu arjun guest to payal rajput mangalavaram pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun: పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. అసలు విషయం ఏంటంటే?

Allu Arjun: పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. అసలు విషయం ఏంటంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 10, 2023 12:21 PM IST

Allu Arjun For Payal Rajput: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ కోసం మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. అసలు విషయం ఏంటంటే?
పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. అసలు విషయం ఏంటంటే?

Allu Arjun To Mangalavaram: 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మూవీ 'మంగళవారం'. గ్లామర్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాలో నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థ భాగస్వామి.

ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ. ఎంతో కలిసి మంగళవారం చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే మంగళవారం మూవీ పోస్టర్స్, ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచారు. ఇక మంగళవారం మూవీ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దీంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మూవీ మేకర్స్.

ప్రమోషన్లలో భాగంగానే శనివారం అంటే నేడు (నవంబర్ 11) హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నారు. అల్లు ఆర్మీ, అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరగనుంది. పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.