Mangalavaram Awards: ఫిలిం ఫెస్టివల్‌లో అదరగొట్టిన మంగళవారం.. బోల్డ్ మూవీకి 4 అవార్డ్స్
Mangalavaram Awards In Jaipur Film Festival: హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన రీసెంట్ బోల్డ్ మూవీ మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మంగళవారం సినిమాకు జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో నాలుగు అవార్డ్స్ అందుకుని సత్తా చాటింది.
Payal Rajput Mangalavaram Awrds: 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. థ్రిల్లింగ్ రెస్పాన్స్‌తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 2023 సంవత్సరంలో నవంబర్ 17న థియేటర్లలో రిలీజైన మంగళవారం మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అజయ్ భూపతి టేకింగ్, పాయల్ రాజ్‌పుత్‌తోపాటు ఇతర నటీనటుల యాక్టింగ్ సినిమాకు బాగా ప్లస్ అయిందని రివ్యూలు వచ్చాయి.
ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ అందించిన బీజీఎమ్ స్కోర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైంది మంగళవారం మూవీ. ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్న మంగళవారం మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం సినిమా అవార్డుల ఖాతా తెరిచింది. ప్రఖ్యాత జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో (Jaipur International Film Festival 2024) మంగళవారం సినిమా అదరగొట్టింది.
జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో (JIIF 2024) మంగళవారం సినిమాకు ఏకంగా 4 అవార్డులు వరించాయి. ఈ విషయాన్ని తాజాగా చిత్ర నిర్మాతలు చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో మంగళవారం మూవీ నాలుగు అవార్డ్స్ దక్కించుకున్నట్లు కొత్తగా పోస్టర్ రిలీజ్ చేస్తూ విషయాన్ని తెలియజేశారు.
జైపూర్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా పాయల్ రాజ్‌పుత్ అవార్డ్ అందుకోగా.. ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో రాజా కృష్ణన్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీలో గుళ్లపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ముదసర్ మొహమ్మద్ అవార్డ్స్ అందుకున్నారు. కథ - కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా 'మంగళవారం' ఇప్పటికే దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకుంది. ఇక ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేసారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు.
ఇదిలా ఉంటే ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో 'ఎ' క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి మంగళవారం సినిమా నిర్మాణంలోకి భాగమయ్యారు. ఇదిలా ఉంటే మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. సినిమాలో పాయల్‌తోపాటు ప్రియదర్శి, అజ్మల్ అమీర్, నందితా శ్వేత, శ్రవణ్ రెడ్డి, రవీంద్ర విజయ్, దివ్య పిళ్లై, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే మంగళవారం సినిమాలో అఫైర్స్ వంటి టాపిక్‌ను బోల్డ్‌గా ప్రజంట్ చేసి వాటి ప్రభావం నిజ జీవితంలో ఎలా ఉంటుందో చూపించారని కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి క్రేజీ కాన్సెప్టుతో తెరకెక్కిన మంగళవారం సినిమా థియేటర్లలో విడుదలైన 40 రోజులకు ఓటీటీలో విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి (డిసెంబర్ 26 తెల్లవారు జామున) మంగళవారం సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.
అయితే థియేట్రికల్‌కు అభ్యంతరకరంగా ఉండి కట్ చేసిన బోల్డ్ సన్నివేశాలతో సహా మంగళవారం సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, అలాంటిదేం లేకుండా థియేట్రికల్ రన్ టైమ్‌తోనే ఓటీటీలో కూడా మంగళవారం సినిమాను విడుదల చేసినట్లు తెలుస్తోంది.