Bigg Boss Amardeep: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ అమర్ దీప్‌తో సినిమా.. మాస్ యువరాజా అంటూ!-ravi teja offered to bigg boss amardeep chowdary a movie act with him bigg boss 7 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Amardeep: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ అమర్ దీప్‌తో సినిమా.. మాస్ యువరాజా అంటూ!

Bigg Boss Amardeep: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ అమర్ దీప్‌తో సినిమా.. మాస్ యువరాజా అంటూ!

Sanjiv Kumar HT Telugu
Published May 12, 2024 12:59 PM IST

Ravi Teja Bigg Boss Amardeep Chowdary: మాస్ మహారాజా రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ రన్నరప్ అమర్ దీప్ చౌదరికి సినిమాలో తనతో నటించే అవకాశం ఇచ్చినట్లు ఇన్‌స్టా పోస్ట్ ద్వారా న్యూస్ వైరల్ అవుతోంది.

 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ అమర్ దీప్‌తో సినిమా.. మాస్ యువరాజా అంటూ!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రవితేజ.. బిగ్ బాస్ అమర్ దీప్‌తో సినిమా.. మాస్ యువరాజా అంటూ!

Ravi Teja Bigg Boss Amardeep Movie: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ద్వారా సూపర్ పాపులర్ అయ్యాడు అమర్ దీప్ చౌదరి. అంతకుముందు జానకి కలగనలేదు సీరియల్‌లో హీరోగా చేసిన అమర్ దీప్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అనంతరం బిగ్ బాస్ 7 తెలుగులోకి అడుగు పెట్టి మరింత సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

టైటిల్ విన్నర్

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మాత్రమే తెలిసిన అమర్ దీప్ బిగ్ బాస్ ద్వారా మాత్రం ఊహించని పాపులారిటీ అందుకున్నాడు. బిగ్ బాస్ 7 తెలుగులోకి టైటిల్ విన్నర్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన అమర్ దీప్ మొదట్లో కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. తరచుగా రైతుబిడ్డగా చెప్పుకునే పల్లవి ప్రశాంత్‌పై కామెంట్స్ చేయడంతో విమర్శల పాలయ్యాడు.

తప్పుబట్టినా

చాలా సార్లు ఫౌల్స్ గేమ్స్ ఆడి అటు హోస్ట్ నాగార్జునకు ఇటు ప్రేక్షకులకు అడ్డంగా దొరికిపోయేవాడు. ఆటపరంగా అమర్ తీరును నెటిన్స్ తప్పుబట్టినా అతనిలో ఉన్న ఎమోషనల్ యాంగిల్, చైల్డిష్ బిహేవియర్‌ పట్ల అట్రాక్ట్ అయ్యారు. దాంతో బిగ్ బాస్ ఫైనల్ వరకు చేరుకుని అమర్ దీప్ రన్నరప్‌గా నిలిచాడు.

రవితేజ అంటే ఎంత పిచ్చో

ఇదిలా ఉంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున గెస్ట్‌గా మాస్ మహారాజా రవితేజ వచ్చాడు. అంతకుముందే చాలా సందర్భాల్లో రవితేజ అంటే అతనికి ఎంత పిచ్చో అమర్ దీప్ చెప్పేవాడు. తన హెయిర్ స్టైల్ కూడా తనలాగే ఉందని రవితేజ అన్నారని, అందుకే టాస్క్‌లో గుండు చేయించుకోలేదని కూడా ఓ సమయంలో చెప్పాడు అమర్ దీప్.

రవితేజ సినిమాలో

అలాంటి తన ఫేవరేట్ హీరో రవితేజ వచ్చినప్పుడు అమర్‌కు మాస్ మహారాజా అంటే ఎంత ఇష్టమో నాగార్జున చెప్పాడు. అప్పుడు అప్పటికప్పుడే హౌజ్ నుంచి బయటకు వస్తే అమర్ దీప్‌కు తన సినిమాలో నటించే అవకాశం ఇస్తాడు అని నాగ్ అంటాడు. దాంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాడు అమర్ దీప్.

టైటిల్ కొట్టినంత

తనపై ఉన్న అభిమానం చూసిన రవితేజ ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు. ప్రోగ్రామ్ అయ్యాకా ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దామని రవితేజ మాట ఇస్తాడు. దాంతో అమర్ దీప్‌కు కప్పు కొట్టినంత సంతోషపడతాడు. ఇప్పుడు అమర్ దీప్ డ్రీమ్ నిజమైంది. తన కల నెరవేరినట్లు ఇన్ స్టా అకౌంట్‌లో పోస్ట్ షేర్ చేశాడు అమర్ దీప్.

నా దేవుడు నువ్వేనయ్యా

ఈ మధ్య రవితేజను కలుసుకున్నాడు అమర్ దీప్. ఈ విషయం చెబుతూ.. "ఫైనల్లీ మాస్ మహారాజా. చివరిగా నా కల నెరవేరింది. లవ్ యు అన్నా. నా దేవుడు నువ్వేనయ్యా. ఫ్యాన్ బాయ్ మూమెంట్స్. చెప్పలేను అంత పిచ్చి నాకు" అని రవితేజతో దిగిన ఫొటోను అమర్ దీప్ షేర్ చేశాడు. దీంతో అమర్ దీప్‌కు రవితేజ తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడని, ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

మాస్ యువరాజా

ఇక ఈ ఫొటో వైరల్ కావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కల్యాణ్ "సూపర్ బావ" అని కామెంట్ రాశాడు. "మాస్ మహారాజాతో మాస్ యువరాజా" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అది చూసి అప్పుడే అమర్‌దీప్‌కు మాస్ యువరాజా అని పేరు పెట్టేశారా అని మరికొంతమంది నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Whats_app_banner