Kalki 2898 AD 2nd Trailer: లీకైన కల్కి 2898 ఏడీ సెకండ్ ట్రైలర్.. మృణాల్ సీన్, ప్రభాస్ ఫైట్ అదుర్స్ (వీడియో)
Prabhas Kalki 2898 AD Second Trailer Leaked: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ సెకండ్ ట్రైలర్ లీక్ అయింది. కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆన్‌లైన్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో మృణాల్ ఠాకూర్ సీన్‌తోపాటు ప్రభాస్ ఫైట్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.
Kalki 2898 AD Second Trailer: మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సినిమా కల్కి 2898 ఏడీపై బజ్ విపరీతంగా ఉంది. ఈ సినిమా నుంచి వస్తోన్న ఒక్కో అప్డేట్ ఆడియెన్స్‌ను మరింత ఎగ్జైట్‌మెంట్‌కు గురి చేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైన ఇట్టే నెట్టింట్లో వైరల్ అయిపోతుంది.
బుధవారం (జూన్ 19)న కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఒకే స్టేజీపై కనిపించి ప్రేక్షకులకు మంచి వినోదం పంచారు. ఇక గ్లోబల్ వైడ్‌గా సంచలనం సృష్టిస్తోన్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పోస్టర్స్, మేకింగ్ వీడియోలు, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
దాంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి సినిమాపై అంచనాలు మరింతగా భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ రెండో ట్రైలర్ లీక్ అయింది. నిన్న ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాకు కల్కి సెకండ్ ట్రైలర్‌ను చూపించారు. అయితే, దాన్ని బయటకు రాకుండా, ఎవరు ఫోన్లలో రికార్డ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
కానీ, తాజాగా ఊహించని విధంగా ఆన్‌లైన్‌లో కల్కి 2898 ఏడీ సెకండ్ ట్రైలర్ లీక్ అయింది. దాంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ సినిమా రెండో ట్రైలర్ తెగ వైరల్ అవుతోంది. ఇక ఇందులోని సీన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. మొదటి ట్రైలర్‌లో చూపించని చాలావరకు సీన్స్, స్టోరీని ఇందులో చూపించారు. అంతేకాకుండా కల్కిలో సీతారామం బ్యూటి మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది.
కల్కి 2898 ఏడీ రెండో ట్రైలర్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించింది. మృణాల్ కడుపులోకి ఒక లైట్ దూసుకొస్తున్న విజువల్ అదిరిపోయింది. అయితే ఈ సన్నివేశాన్ని బట్టి మహాభారతంలోని ఉత్తర పాత్రను మృణాల్ ఠాకూర్ పోషిస్తోన్నట్లు తెలుస్తోంది. తాను సంధించిన బ్రహ్మస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్లిస్తాడు అశ్వత్థామ. కాబట్టి ఇది అదే సీన్ అయింటుందని నెట్టింట్లో చర్చ జరుగుతోంది.
అలాగే ట్రైలర్‌లో ప్రభాస్ అదే భైరవ చేసే ఫైట్ సీన్ మరింతగా అదిరిపోయింది. అశ్వత్థామ, భైరవ మధ్య జరిగే పోరాట సన్నివేశానికి సంబంధించి మరికొన్ని సీన్స్ రెండో ట్రైలర్‌లో చూపించారు. అవి సూపర్బ్‌గా ఉన్నాయి. కమల్ హాసన్, దీపికా పదుకొణె సీన్స్ కూడా చూపించారు. చూస్తుంటే.. మొదటి ట్రైలర్ కంటే కల్కి రెండో ట్రైలరే మరింత అద్భుతంగా ఉందని చెప్పొచ్చు.
కల్కి రిలీజ్‌కు ముందు ఈ రెండో ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఆన్‌లైన్‌లో సెకండ్ ట్రైలర్ లీక్ అయింది. కాబట్టి అతి త్వరలోనే అధికారింగా కల్కి 2898 ఏడీ సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ట్రైలర్ నిన్న రాత్రి నుంచి ట్రెండింగ్‌లో ఉంది. అసభ్యకర పదాలతో ఈ ట్రైలర్‌ను షేర్ చేస్తున్నారు నెటిజన్స్.
టాపిక్