SDGM: బ్లాక్ బస్టర్ హీరోతో బాలకృష్ణ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోయిన్స్‌గా ఇద్దరు హాట్ బ్యూటీలు.. ఎవరంటే?-director gopichand malineni bollywood debut movie with sunny deol regina cassandra saiyami kher working title is sdgm ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sdgm: బ్లాక్ బస్టర్ హీరోతో బాలకృష్ణ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోయిన్స్‌గా ఇద్దరు హాట్ బ్యూటీలు.. ఎవరంటే?

SDGM: బ్లాక్ బస్టర్ హీరోతో బాలకృష్ణ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోయిన్స్‌గా ఇద్దరు హాట్ బ్యూటీలు.. ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 20, 2024 04:39 PM IST

Gopichand Malineni Movie With Sunny Deol: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్టార్ హీరో సన్నీ డియోల్‌తో బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హాట్ బ్యూటీలు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. మాసీవ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది.

బ్లాక్ బస్టర్ హీరోతో బాలకృష్ణ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోయిన్స్‌గా ఇద్దరు హాట్ బ్యూటీలు.. ఎవరంటే?
బ్లాక్ బస్టర్ హీరోతో బాలకృష్ణ డైరెక్టర్ బాలీవుడ్ ఎంట్రీ.. హీరోయిన్స్‌గా ఇద్దరు హాట్ బ్యూటీలు.. ఎవరంటే?

Gopichand Malineni Sunny Deol SDGM: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. మొన్నటివరకు హీరోగా ఫెయిల్యూర్స్ చూసిన ఆయన చుప్ వంటి సినిమాల్లో కీలక పాత్రలకు పరిమితం అయ్యారు. అలాంటి సన్నీ డియోల్‌కు 2023లో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా గదర్ 2. 2023లో బాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని తన రేంజ్ ఏంటో మళ్లీ చూపించారు.

నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 100 సినిమాల దిశగా దూసుకుపోతున్న సన్నీ డియోల్ యాంగ్రీ యాక్షన్ హీరోగా అలరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ వై రవి శంకర్, నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్ సంయుక్తంగా, గ్రాండ్‌గా నిర్మించే స్ట్రెయిట్ హిందీ సినిమా కోసం బ్లాక్‌ బస్టర్ మెషిన్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు సన్నీ డియోల్.

రవితేజతో (Ravi Teja) బలుపు, క్రాక్.. బాలకృష్ణతో (Balakrishna) వీరసింహా రెడ్డి వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్‌తో #SDGM చిత్రాన్ని మ్యాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. ఇది గోపీచంద్ మలినేని మేడిన్ హిందీ మూవీ.

మునుపెన్నడూ చూడని యాక్షన్‌ అవతార్‌లో హీరోని ప్రెజెంట్ చేయనున్నారు. సౌత్ దర్శకులతో బాలీవుడ్ స్టార్ల సినిమాలపై నార్త్ ప్రేక్షకులు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్టార్‌లతో హై-బడ్జెట్ సినిమాలు తీయడంలో ప్రసిద్ధి చెందాయి.

రెండు నిర్మాణ సంస్థలు, డైరెక్టర్ సరైన సమయంలో సరైన మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. #SDGM హై ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ బిగ్ కాన్వాస్‌పై రూపొందనుంది. ఈరోజు గురువారం (జూన్ 20) హైదరాబాద్‌లో కోర్ టీమ్, ప్రత్యేక అతిథులతో సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. దీనికి సినిమా టీమ్ అంతా హాజరైంది.

ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు హాట్ బ్యూటీలు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. వాళ్లు ఎవరో కాదు ఒకరు బాలీవుడ్ ముద్దుగుమ్మ సయామీ ఖేర్ (Saiyami Kher) అయితే, మరొకరు టాలీవుడ్ భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra). 

కాగా టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రిషి పంజాబీ డీవోపీ కాగ, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

ఈ భారీ చిత్రానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, అనల్ అరసు అండ్ వెంకట్ మాస్టర్స్ ఫైట్ కొరియోగ్రాఫర్స్‌గా వ్యవహరించనున్నారు. అయితే, ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాకు మాస్ ఫీస్ట్ లోడింగ్ అనేది క్యాప్షన్‌గా చెబుతున్నారు. 

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు సినిమాలో సన్నీ డియోల్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా అని మాత్రమే తెలిసిందే. త్వరలో మిగతా నటీనటులు, టైటిల్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

WhatsApp channel