Most Expensive TV Serial: అధిక బడ్జెట్‌తో తీసిన టీవీ సీరియల్.. ఇది టీవీ బాహుబలి.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్ని కోట్ల ఖర్చంటే?-most expensive tv show in india ram siya ke luv kush budget 650 cr more than kalki 2898 ad rrr budget called tv bahubali ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Expensive Tv Serial: అధిక బడ్జెట్‌తో తీసిన టీవీ సీరియల్.. ఇది టీవీ బాహుబలి.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్ని కోట్ల ఖర్చంటే?

Most Expensive TV Serial: అధిక బడ్జెట్‌తో తీసిన టీవీ సీరియల్.. ఇది టీవీ బాహుబలి.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్ని కోట్ల ఖర్చంటే?

Sanjiv Kumar HT Telugu
May 31, 2024 02:38 PM IST

Most Expensive TV Show In India Ram Siya Ke Luv Kush: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియా కె లవ్ కుష్. టీవీ బాహుబలిగా పిలిచే ఈ సీరియల్ బడ్జెట్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాల కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

అధిక బడ్జెట్‌తో తీసిన టీవీ సీరియల్.. ఇది టీవీ బాహుబలి.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్ని కోట్ల ఖర్చంటే?
అధిక బడ్జెట్‌తో తీసిన టీవీ సీరియల్.. ఇది టీవీ బాహుబలి.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్ని కోట్ల ఖర్చంటే?

Most Expensive TV Show In India: భారతదేశంలో చిన్న మాధ్యమంగా ప్రారంభమైంది టెలివిజన్. థియేటర్, ఓటీటీల్లో సినిమా, వెబ్ సిరీస్‌ల తర్వాత ఎంటర్టైన్‌మెంట్ పంచేది టీవీ సీరియల్స్. అవి ఎంతో నాటకీయంగా, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా ఉంటాయి. ఇప్పుడు సినిమాలకు అత్యధిక బడ్జెట్స్ పెడుతున్నారు. సీరియల్స్‌కు వాటితో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు చేస్తుంటారు.

ఇప్పుడు సీరియల్స్ ఎక్కువగా పుట్టుకొస్తున్న గతంలో మాత్రం సినిమాల కంటే సీరియల్స్‌ చాలా తక్కువగా నిర్మించేవారు, తక్కువ ఖర్చు చేసేవారు. భారతీయ టెలివిజన్‌లో హద్దులు చెరిపేసిన రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ కూడా మెగా బడ్జెట్‌లో రూపొందలేదు. కానీ, శతాబ్దం తర్వాత భారతీయ టెలివిజన్ కార్యక్రమాల బడ్జెట్లు, ప్రమాణాలు మారిపోయాయి. వాటిలో, ఈనాటికి భారతీయ సినిమా కూడా ఎన్నడూ చేయని విధంగా అతిపెద్ద, అధిక బడ్జెట్‌తో నిర్మించిన టీవీ షో ఉంది.

2019లో సిద్ధార్థ్ కుమార్ తివారి రామాయణం ఆధారంగా రామ్ సియా కె లవ్ కుష్ అనే పౌరాణిక సీరియల్‌ను రూపొందించారు. ఆ సమయంలో భారతీయ టెలివిజన్‌లో ఈ సీరియల్ కచ్చితంగా అతిపెద్ద ప్రాజెక్ట్. నివేదికల ప్రకారం, ఈ షో ప్రతి ఎపిసోడ్ రూపొందించడానికి సుమారు రూ.4 కోట్లకు పైగా ఖర్చు అయింది. మిడ్-డే నివేదిక ప్రకారం సీరియల్ మొత్తం నిర్మాణ వ్యయం రూ. 650 కోట్లు. దీనికంటే ముందు తర్వాత ఏ సీరియల్, కానీ, సినిమా కానీ ఇంత బడ్జెట్‌లో రాలేదు.

దీంతో ఈ రామ్ సియా కె లవ్ కుష్ సీరియల్‌ను దర్శక దిగ్గజం తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పోల్చారు. అందుకే దీన్ని టీవీ బాహుబలి అని పిలుస్తుంటారు. ఆగస్ట్ 2019లో ఈ సీరియల్ విడుదలైన సమయంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా సాహో ఉంది. ప్రభాస్ సాహో మూవీ బడ్జెట్ రూ. 350 కోట్లు. రామ్ సియా కే లవ్ కుష్ దీనికి రెట్టింపు.

ఇక RRR (రూ. 500 కోట్లు), బ్రహ్మాస్త్ర (రూ. 400 కోట్లు) సినిమాలు కూడా ఈ సీరియల్ బడ్జెట్‌ను చేరుకోలేకపోయాయి. అంతేకాకుండా 2023లో రామాయణం ఆధారంగా తీసిన ఆదిపురుష్ సినిమా భారతదేశపు అత్యంత ఖరీదైన చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ దాని బడ్జెట్ రూ. 550 కోట్లు. ఇది కూడా రామ్ సియా కే లవ్ కుష్ కంటే తక్కువగా ఉంది.

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడీ బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. అయితే, 650 కోట్లతో తెరకెక్కిన రామ్ సియా కే లవ్ కుష్ సీరియల్ మార్క్‌ మాత్రం చెక్కుచెదరకుండా ఉండేలా ఉంది. కాగా రామ్ సియా కే లవ్ కుష్ సీరియల్ ఉత్తర రామాయణం ఆధారంగా రూపొందించారు. ఈ సీరియల్‌లో రాముడు, సీత కుమారులు లవ్, కుష్ గురించి చూపించారు.

ఇక ఈ సీరియల్‌లో రాముడిగా హిమాన్షు సోనీ, సీతగా శివా పఠానియా నటించారు. అలాగే లవ్ అండ్ కుష్‌లుగా క్రిష్ చౌహాన్, హర్షిత్ కబ్రా నటించారు. ఈ సీరియల్ ఆగస్టు 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు ప్రసారం అయింది. ఈ సీరియల్‌ నుంచి మొత్తం 141 ఎపిసోడ్‌లు వచ్చాయి.

Whats_app_banner