OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన అల్లరి నరేష్ కమ్‌ బ్యాక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూస్తారంటే?-allari naresh comedy movie aa okkati adakku ott streaming on amazon prime aa okkati adakku digital premiere ott movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన అల్లరి నరేష్ కమ్‌ బ్యాక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూస్తారంటే?

OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన అల్లరి నరేష్ కమ్‌ బ్యాక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూస్తారంటే?

Sanjiv Kumar HT Telugu
May 31, 2024 08:47 AM IST

Aa Okkati Adakku OTT Streaming Now: కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ చాలా రోజులకు కామెడీ జోనర్‌లో కమ్ బ్యాక్‌గా నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి సడెన్‌గా వచ్చింది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసిన ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటంటే..

ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన అల్లరి నరేష్ కమ్‌ బ్యాక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూస్తారంటే?
ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసిన అల్లరి నరేష్ కమ్‌ బ్యాక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూస్తారంటే?

Aa Okkati Adakku OTT Release: తన కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం తెలుగు ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసిన అల్లరి హీరో అల్లరి నరేష్ (Allari Naresh). మొదటి నుంచి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో సీరియస్ పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. తనలో కామెడీ టైమింగ్‌తోపాటు ఇంటెన్స్ యాక్షన్ కూడా ఉందని రుజువు చేశాడు.

ఫస్ట్ లుక్ నుంచి

నాంది, ఇట్లు మారెడుపల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ చాలా కాలం గ్యాప్ తర్వాత చేసిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు. చాలా రోజుల తర్వాత తన కామెడీ కమ్ బ్యాక్ సినిమాగా వచ్చిన ఆ ఒక్కటి అడక్కుపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకే సినిమాకు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్, మూవీ విడుదల వరకు మంచి బజ్ క్రియేట్ అయింది.

అల్లరి నరేష్ తండ్రి

అంతేకాకుండా నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, అల్లరి నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ కావడంతో ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ నెలకొంది. అలాగే ఇందులో అల్లరి నరేష్‌కు జోడీగా జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్ అని తెలియడంతో ఆడియెన్స్ పట్ల ఉత్సాహం మొదలైంది. ఇలా ఎన్నో అంచనాలతో మే 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ ఒక్కటి అడక్కు.

కలెక్షన్ల పరంగా

అయితే, ఆ ఒక్కటి అడక్కు సినిమాకు టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. రొటీన్ కామెడీ, అని పాత టైటిల్‌ను చెడగొట్టారని విమర్శలు వచ్చాయి. కానీ, కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించుకుంది ఈ మూవీ. అలాంటి ఆ ఒక్కటి అడక్కు మూవీ ఓటీటీలోకి తాజాగా వచ్చేసింది. అది కూడా చడీ చప్పుడు కాకుండా సైలెంట్‌గా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

రాని అధికారిక ప్రకటన

అయితే, మే 31 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అక్కడక్క కొన్ని చోట్ల వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం సదరు ఓటీటీ సంస్థ ప్రకటించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా సడెన్‌గా, సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime OTT) ఆ ఒక్కటి అడక్కు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు భాషలో మాత్రమే ఆ ఒక్కటి అడక్కు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

నెల కాకముందే

అంటే, నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చిన ఈ కామెడీ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే థియేటర్లలో మిస్ అయిన ఆడియెన్స్ సైతం ఓటీటీలో ఈ అల్లరోడి కమ్ బ్యాక్ కామెడీ చిత్రాన్ని చూసి ఆస్వాదించొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే ఆయన తెలుగులో డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా తొలిసారి జోడి కట్టారు.

పెళ్లి కోసం తంటాలు

ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి సినిమాకు డైలాగ్స్ అందించారు. కాగా సినిమాలో ఏజ్ బారైన ఓ వ్యక్తి పెళ్లి కోసం పడే తంటాలను చూపించారు. అందుకోసం మాట్రిమొని సైట్స్‌ను కలవడం, వారు చేసే మోసాలు ఎలా ఉంటాయో సినిమాలో చూపించారు.

టీ20 వరల్డ్ కప్ 2024