Aa Okkati Adakku: ఈరోజుల్లో పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్, మానసికంగా కుంగిపోతున్నారు: నిర్మాత రాజీవ్ చిలక కామెంట్స్
Aa Okkati Adakku Producer About Marriage: అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ కామెడీ ఫిల్మ్ ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా నిర్మాత రాజీవ్ చిలక పెళ్లిపై ఆశ్చర్యకర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సెటిల్ అవ్వడం కంటే పెళ్లి కావడం పెద్ద టాస్క్ అని ఆయన చెప్పారు.
Rajiv Chilaka About Marriage: కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఇందులో ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఆ ఒక్కటి అడక్కు (Aa Okkati Adakku Movie 2024) సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత రాజీవ్ చిలక విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఈ సినిమాని నిర్మించడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి?
సినిమాలు నిర్మించాలనే దీర్గకాలిక ప్రణాళికతో పరిశ్రమలోకి వచ్చాను. మంచి కథ కోసం చూస్తున్నపుడు దర్శకుడు మల్లి ఈ కథ చెప్పారు. పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. ఈ కథలో కామెడీ, ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ జోనర్ సినిమా మా మొదటి సినిమాగా సెట్ అవుతుందని భావించాం.
చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ గురించి ?
నా పూర్తి పేరు రాజీవ్ చిలకలపూడి. 2018లో పేరుని రాజీవ్ చిలక అని కుదించాను. ఆ పేరు బాగా కలిసొచ్చింది. ఛోటా భీమ్ పెద్ద హిట్ అయ్యింది. బ్యానర్‌కి ఏం పేరు పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు చాలా పేర్లు సూచనలుగా వచ్చాయి. అయితే చిలక పేరు పాజిటివ్‌గా ఉందని అదే పేరుతో చిలక ప్రొడక్షన్స్‌ని ప్రారంభించడం జరిగింది.
మీ మొదటి సినిమాకే పెళ్లి సబ్జెక్ట్ ని ఎంచుకోవడానికి కారణం ?
"ఇది అందరూ రిలేట్ అయ్యే సబ్జెక్ట్. రిలేట్ చేసుకునే ప్రాబ్లం. పెళ్లి అనేది నేటి రోజుల్లో తన ఒక్కడికే సమస్య, తనకే పెళ్లి కావడం లేదనే ధోరణితో చాలా మంది మానసికంగా క్రుంగుబాటుకి గురౌతున్నారు. ఈ రోజుల్లో సెటిల్ అవ్వడం కంటే పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్‌గా మారింది" అని ఆ ఒక్కటి అడక్కు నిర్మాత రాజీవ్ చిలక తెలిపారు.
"ఒకప్పుడు బంధువులు, చుట్టాలు చుట్టు పక్కల ఉంటూ వాళ్లే పెళ్లి సంబధాలు చూసే వారు. కానీ, ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి. ఒకొక్కరూ ఒకొక్క రాష్ట్రంలో, దేశంలో ఉంటున్నారు. పెళ్లి కోసం వెబ్ సైట్స్‌పై ఆధారపడుతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్ ద్వారానే లక్షల్లో పెళ్ళిళ్లు జరుగుతున్నాయి. పైగా ఇందులో ఒకరిగురించి ఒకరికి తెలీయదు కూడా. జీవితానికి సంబధించిన పెద్ద నిర్ణయాన్ని ఇలా తీసుకుంటున్న పరిస్థితి ఉంది" అని నిర్మాత అన్నారు.
"ఇది నేడు యువత ఎదుర్కొంటున్న సమస్య. అందరూ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఈ కథ చాలా వినోదాత్మకంగా చెప్పాం. కామెడీ, డ్రామా, హ్యుమర్ , సాంగ్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ అద్భుతంగా వచ్చాయి" అని నిర్మాత రాజీవ్ చిలక చెప్పుకొచ్చారు.