Allari Naresh Ugram Teaser: అల్లరి నరేష్ ఉగ్రం టీజర్ వచ్చేసింది.. సీరియస్ ఇంటెన్స్ లుక్‌లో అల్లరోడు అదుర్స్
Allari Naresh Ugram Teaser: నాంది లాంటి సూపర్ హింట్ అందించిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ మరో సినిమా చేస్తున్నాడు. అదే ఉగ్రం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. నాగచైతన్య చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది.
Allari Naresh Ugram Teaser: అల్లరి నరేష్ నాంది సినిమాతో కథల ఎంపికలో మార్పులు తీసుకొచ్చాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో తన తదుపరి చిత్రాలను కూడా ఆచి తూచి ఎంచుకుంటున్నాడు. వేగంగా సినిమాలు చేయడం మానేసి కంటెంట్ ఉన్న సినిమాల కోసం చూస్తున్నాడు. ఇందులో భాగంగానే గతేడాది విడుదలైన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా. ఈ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో అల్లరొడు మరో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడు నటించిన తాజా చిత్రం ఉగ్రం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదలైంది. అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. నాంది లాంటి సూపర్ అందించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఉగ్రం.. పేరుకు తగ్గట్లుగానే అల్లరి నరేష్ లుక్, బాడీ లాంగ్వేజ్ సీరియస్‌గా ఉంది. ఇంటెన్స్ లుక్‌తో విలన్ల భరతం పట్టడమే కాకుండా, తనకు అలవాటు లేని పంచ్ డైలాగ్స్‌ను అదిరిపోయేలా చెప్పాడు. టీజర్‌ను గమనిస్తే అల్లరి నరేష్ పోలీసు అధికారి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా బాగా పండేలా చూసుకున్నాడు దర్శకుడు. టీజర్‌ను బట్టి చూస్తే ఇది యాక్షన్ ఓరియేంటెడ్ ఫ్యామిలీ రివేంజ్‌లా కనిపిస్తోంది. చివర్లో అల్లరి నరేష్ డైలాగ్ బట్టే ఈ విషయం అర్థమవుతుంది.
ఒంటి మీద యూనిఫారం ఉందనే కదా నీ పొగరు.. ఈ రోజు నీదే.. నాక్కూడా ఓ రోజు వస్తుంది అని విలన్ అనగా.. నాది కూడా రోజు కూడా నేను ఇలాగే నిలబడతా.. అర్థమైందా అంటూ అల్లరి నరేష్ ఇంటెన్స్ డైలాగ్‌తో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా. ఈ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. దీంతో టీజర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేశాడు అల్లరి నరేష్.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విజయ్ కనకమేడల వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం