Faria Abdullah About Jathi Ratnalu 2: మొదటి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో ఫరియాకు బీభత్సమైన పాపులారిటీ వచ్చేసింది. దాంతో క్రేజీ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. ఇప్పుడు మరో కామెడీ సినిమాతో అలరించేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తోంది ఫరియా అబ్దుల్లా. కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు.
ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నరేష్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మే 3న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటుంది ఫరియా. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆ ఒక్కటి అడక్కు సినిమాతోపాటు జాతి రత్నాలు 2, మత్తు వదలరా 2 చిత్రాలపై అప్డేట్ ఇచ్చింది చిట్టి. దీంతో ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇందులో నా పాత్ర పేరు సిద్ధి. నా పాత్ర చాలా స్వేఛ్చగా ఉంటుంది. అన్ని ప్లాన్ చేసి, నిబంధనలు పెట్టుకొని అందులోనే బ్రతకడం తనకి ఇష్టం ఉండదు. హీరో పాత్ర నా పాత్రకు భిన్నంగా ఉంటుంది. తను అన్నీ ప్లాన్ ప్రకారం ఉంటారు. ఈ రెండు పాత్రల మధ్య మంచి కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. అదే సమయంలో మంచి ఎట్రాక్షన్ ఉంటుంది. కథ పెళ్లి అనే అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ ఒక్కటీ అడక్కు కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్‌గా ఉంటుంది.
సవాల్‌గా అనిపించలేదు. ఎందుకంటే.. నేను కూడా ఫ్రీ ఫ్లోలోనే ఉంటాను. నాకు చాలా కనెక్ట్ అయిన పాత్ర ఇది. దర్శకుడు కథ చెప్పినపుడు కంటెంట్ చాలా నచ్చింది. ఈ రోజుల్లో అందరికీ అవసరమయ్యే కంటెంట్ ఇది.
ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో కామెడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. పరిస్థితుల నుంచే పుట్టే హాస్యం ఉంటుంది. ఇందులో కామెడీ చాలా నేచురల్‌గా పుడుతుంది. ఇందులోని కంటెంట్ ప్రేక్షకులని సహజంగా నవ్విస్తుంది.
"ప్రస్తుతం నిర్మాతలు ‘ప్రాజెక్ట్ కె’ (Project K) సినిమాతో బిజీగా ఉన్నారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. కల్కి (Kalki 2898 AD) కోసం నేనూ ఎదురుచూస్తున్నాను. కల్కి విడుదల (Kalki 2898 AD Release Date) తర్వాత జాతిరత్నాలు 2 కోసం ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను" అని జాతి రత్నాలు 2 (Jathi Ratnalu 2) సినిమాపై అప్డేట్ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా
'మత్తువదలరా 2' (Mathu Vadalara 2) చేస్తున్నాను. గోపి దర్శకత్వంలో భగవంతుడు అనే సినిమా చేస్తున్నాను. అలాగే ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్ని తమిళ. మలయాళం కథలు కూడా వింటున్నాను.
ఇదిలా ఉంటే, 2021లో వచ్చిన జాతి రత్నాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అనుదీప్ కేవీ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. అలాగే ఇచ్చేయండి సార్ అని ఫరియా అబ్దుల్లా చెప్పిన డైలాగ్ ఎంత పెద్ద ఫేమసో తెలిసిందే.
టాపిక్