Faria Abdullah: అతని హైట్ మ్యాచ్ చేయడానికే ఫరియా.. జాతి రత్నాలు హీరోయిన్‌పై నిర్మాత కామెంట్స్
Aa Okkati Adakku Rajiv Chilaka Faria Abdullah: జాతి రత్నాలు సినిమాతో చిట్టీగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడు అల్లరి నరేష్‌తో జోడీ కడుతూ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో రానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత ఫరియా హైట్‌పై కామెంట్స్ చేశాడు.
Rajiv Chilaka About Faria Abdullah: బ్యూటిఫుల్ ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఇందులో చిట్టిగా నటించిన ఫరియా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చిట్టి అయిపోయింది. దాంతో ఆమెకు ఎంతోమంది ఫ్యాన్స్ అయిపోయారు. జాతి రత్నాలు సినిమాలో ఫరియా కామెడీ టైమింగ్ అదిరిపోవడంతో చిట్టి మాయలో పడిపోయారు.
సోనీ లివ్ ఓటీటీలో
జాతి రత్నాలు తర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమాలో హీరోయిన్‌గా అట్రాక్ట్ చేసింది. రవితేజ రావాణసుర సినిమాలో ఒక హీరోయిన్‌గా అలరించింది. సోగ్గాడు మళ్లీ వచ్చాడు మూవీలో ఓ పాటకు నర్తించి మెస్మరైజ్ చేసింది. ఇవే కాకుండా ది జెంగబూరు కర్స్ అనే వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్ రోల్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కామెడీ సినిమా
ఇప్పుడు ఫరియా అబ్దుల్లా నటిస్తున్న కొత్త సినిమా ఆ ఒక్కటి అడక్కు. అల్లరి నరేష్ చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ కామెడీ సినిమాలో హీరోయిన్‌గా ఫరియా చేస్తోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ సినిమాతో మల్లి అంకం డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.
ఫరియా అబ్దుల్లా హైట్‌పై
ఇటీవల విడుదలైన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా ప్రమోషనల్ కంటెంట్‌తో బిజీగా ఉన్న నిర్మాత రాజీవ్ చిలక ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఫరియా అబ్దుల్లా హైట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు నిర్మాత రాజీవ్ చిలక.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి?
నరేష్ గారు హైట్ ఎక్కువ ఉంటారు. నిజానికి ఆయన ఎత్తుకి చాలా మంది హీరోయిన్స్ సరిపోరు. ఆయన హైట్‌ని మ్యాచ్ చేయడానికి ఫరియా అయితే బాగుంటుంది అనిపించింది. అలాగే ఫరియా కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఈ కథ నచ్చి ఫరియా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అలాగే జానీ లీవర్ గారి అమ్మాయి జెమి లివర్ ఇందులో కీలక పాత్రలో కనిపిస్తారు. దీంతో పాటు మురళి శర్మ, వెన్నెల కిషోర్, వైవా హర్ష వీరందరి పాత్రలు వినోదాత్మకంగా ఉంటాయి.
గోపిసుందర్ మ్యూజిక్ గురించి ?
మ్యూజిక్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాం. అందుకే గోపి సుందర్ గారిని ఎంపిక చేశాం. సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. నేపథ్యసంగీతంలో ఎమోషన్ అద్భుతంగా పండింది.
యానిమేషన్స్‌లో కొత్త ప్రాజెక్ట్స్ ?
ఛోటా భీమ్‌ని రియల్ పిల్లలతో చేయబోతున్నాం. అలాగే డిస్నీలో ఒక యానిమేషన్ షో లాంచ్ కాబోతుంది. అది ఛోటా స్టార్ట్ అప్‌గా చేస్తున్నాం. చాలా ఫన్‌గా ఉంటుంది. మే6న లాంచ్ కాబోతుంది. "నిర్మాతగా ఎలాంటి సినిమాలు తీయాలని ఉందన్న" ప్రశ్నకు మంచి ఫ్యామిలీ సినిమాలు తీయాలని ఉంది. అలాగే ఫాంటసీ, హిస్టారికల్, కామెడీ జోనర్స్ చేయాలని ఉందని నిర్మాత రాజీవ్ చిలక సమాధానం ఇచ్చారు.
ఇకపోతే ఫరియా అబ్దుల్లా, అల్లరి నరేష్ జోడీగా చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ఆ ఒక్కటి అడక్కు మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.