Ravi Teja: రవితేజ డైరెక్టర్‌తో హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త సినిమా.. రియల్ గన్స్ వాడమంటూ!-hanuman hero teja sajja new movie with ravi teja eagle director karthik gattamneni and real guns used in eagle movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja: రవితేజ డైరెక్టర్‌తో హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త సినిమా.. రియల్ గన్స్ వాడమంటూ!

Ravi Teja: రవితేజ డైరెక్టర్‌తో హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త సినిమా.. రియల్ గన్స్ వాడమంటూ!

Sanjiv Kumar HT Telugu
Feb 10, 2024 08:43 AM IST

Karthik Gattamneni New Movie With Teja Sajja: డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ఈగల్. ఇందులో మాస్ మహరాజా రవితేజ హీరోగా చేశాడు. ఈగల్ మూవీలో రియల్ గన్స్ వాడినట్లు చెప్పిన డైరెక్టర్ కార్తీక్ తన నెక్ట్స్ సినిమాపై అప్డేట్ ఇచ్చాడు.

రవితేజ డైరెక్టర్‌తో హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త సినిమా.. రియల్ గన్స్ వాడమంటూ!
రవితేజ డైరెక్టర్‌తో హనుమాన్ హీరో తేజ సజ్జా కొత్త సినిమా.. రియల్ గన్స్ వాడమంటూ!

Karthik Gattamneni About Ravi Teja Eagle: మాస్ మహారాజా రవితేజ నటించిన కొత్త చిత్రం ఈగల్. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. అలాగే హీరో నవదీప్ కీలక పాత్ర పోషించాడు. ఈగల్ మూవీకి యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. తెలుగులోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఈగల్ సినిమాను నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.

ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు థియేటర్లలో ఈగల్ మూవీ విడుదలైంది. శుక్రవారం (ఫిబ్రవరి 9) రవితేజ ఈగల్ మూవీ విడుదలైంది. ఇందులో రవితేజ యాక్షన్ విధ్వంసం చూపించారని నెటిజన్స్, ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నడూ చూడని విధంగా మాస్ మహారాజాను చూసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈగల్ సినిమా విశేషాలను తాజాగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పంచుకున్నారు. దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"ఈగల్ (గద్ద) నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కూడా కిందున్న రాబిట్‌ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ ఉంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ఈగల్. హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా ఉంది. దీంతో ఈ కథలో హీరో పేరు 'సహదేవ్ వర్మ' టైటిల్ తో హిందీలో విడుదల చేశాం. నాకు స్టొరీ టెల్లింగ్ అంటే ఇష్టం. అయితే డీవోపీ యాక్సిడెంటల్‌గా జరుగుపోయింది. దాన్ని ఒక బ్లెస్సింగ్‌గానే భావిస్తాను" అని డైరెక్టర్ కార్తీక్ తెలిపాడు.

"ఈగల్ సౌండ్ డిజైన్ ఆరు నెలలు చేశాం. అన్ని రియల్‌గా ప్రోడ్యుస్ చేశాం. యూరప్‌లో రియల్ గన్స్‌తో షూట్ చేసి ఆ సౌండ్‌ని రికార్డ్ చేశాం. నేపథ్యసంగీతంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి థియేటర్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వొచ్చు. డేవ్ జాండ్ పదేళ్లుగా తెలుసు. తనతో మంచి జర్నీ ఉంది. డైలాగ్ రైటర్ మణిబాబుతో నేను కార్తికేయ 2 చేశాను. అప్పటినుంచి మా మధ్య అనుబంధం ఏర్పడింది. మాకు మంచి బ్యాలెన్స్ కుదిరింది. తన పదప్రయోగం చాలా బాగుంటుంది" అని ఈగల్ డైరెక్టర్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

"పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోం బ్యానర్‌లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిది ఒక్క ఫోన్ కాల్‌తో సమకూర్చుతారు. నిర్మాత విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు. ఇక హనుమాన్ హీరో తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తాం" అని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించాడు.

"ఈగల్ మూవీలో నవదీప్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరో అలోచలను కాంప్లీమెంట్ చేసే పాత్రలో నవదీప్ కనిపిస్తారు. నవదీప్ తన నటనతో సర్‌ప్రైజ్ చేశారు. తనకి చాలా మంచి మెమరీ పవర్ ఉంది. అలాగే అనుమప ఈ కథని ముందుకు నడిపించే పాత్రలో కనిపిస్తారు. కావ్య పాత్ర ఈ కథకు మరో కారణం. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా ఉంటుంది" అని ఈగల్ నటీనటుల ప్రాముఖ్యతను తెలిపాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని.

Whats_app_banner