Aa Okkati Adakku Teaser: పెళ్లి కోసం తంటాలు.. అల్లరి నరేశ్ మార్క్ ఎంటర్‌మెంట్‌తో ‘ఆ ఒక్కటి అడక్కు’ టీజర్
Aa Okkati Adakku Movie Teaser: ఆ ఒక్కటి అడక్కు టీజర్ వచ్చేసింది. పెళ్లి కోసం తంటాలు పడే యువకుడిగా తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో అలరించారు అల్లరి నరేశ్. టీజర్ ఎలా ఉందంటే..
Aa Okkati Adakku Teaser: చాలా ఏళ్ల పాటు బోలెడన్ని కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేశ్.. మూడేళ్లుగా సిరీయస్ సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్నారు. 2021లో నాంది సూపర్ హిట్ అవడంతో అదే బాటలో నడిచారు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం చిత్రాలు చేశారు. దీంతో అల్లరి నరేశ్ మళ్లీ కామెడీ ప్రధానమైన సినిమా ఎప్పుడు చేస్తారా అని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. ఈ తరుణంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో మళ్లీ తన మార్క్ కామెడీతో అల్లరి నరేశ్ వచ్చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ నేడు (మార్చి 12) రిలీజ్ అయింది.
టీజర్ ఇలా..
పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రను ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంలో పోషించారు అల్లరి నరేశ్. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని, లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత పెళ్లెప్పుడు అని గణ (అల్లరి నరేశ్)ను అందరూ అడుగుతుంటారు. అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తారు.
ఆ తర్వాత ఓ మ్యారేజ్ బ్యూరోకు కూడా వెళతారు. “సెకండ్ హ్యాండ్ వస్తువులను ఓఎల్‍ఎక్స్‌లో కొంటున్నారు కానీ.. ఫ్రెష్ పీస్ ఎందుకు కొనడం లేదో తెలియడం లేదు” అని గణ సోదరి డైలాగ్ ఉంది. ఆ తర్వాత హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో గణకు పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి తిరుగుతారు. అయితే, పెళ్లి చేసుకుంటానని గణ అడిగితే.. ‘ఆ ఒక్కటి అడక్కు’ అని ఫారియా అబ్దుల్లా చెప్పడంతో అతడు అవాక్కవుతాడు.
అల్లు నరేశ్ మార్క్
మొత్తంగా 66 సెకన్ల పాటు ఉన్న ‘ఆ ఒక్కటి అడక్కు’ టీజర్ ఆసాంతం సరదాగా ఉంది. తన కామెడీ టైమింగ్‍తో అల్లరి నరేశ్ అదరగొట్టారు. తన మార్క్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో అలరించారు. దీంతో ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంగానే ఇది ఉంటుందని స్పష్టమైంది. పెళ్లి అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా ఉండటంతో ఈ చిత్రం యూత్‍కు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‍గా నటించారు. వెన్నెల కిశోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ కీలకపాత్రలు పోషించారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.
రిలీజ్ ఎప్పుడు..
ఆ ఒక్కటి అడక్కు మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రాన్ని మార్చి 22వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు ఇటీవల సమాచారం బయటికి వచ్చింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు వచ్చిన టీజర్లోనూ రిలీజ్ డేట్ లేదు. వేసవికి ఈ చిత్రం వస్తుందని మూవీ టీమ్ పేర్కొంది. కచ్చితమైన తేదీని ప్రకటించలేదు. త్వరలో ఆ ఒక్కటి అడక్కు రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఎక్కువగా పోటీ లేని సమయంలో ఈ చిత్రాన్ని తీసుకురావాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.