Darling: ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య తెగిన పంచాయతీ.. అసలు గొడవ ఇది డార్లింగ్!-priyadarshi nabha natesh darling title glimpse released by hanuman director prasanth varma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darling: ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య తెగిన పంచాయతీ.. అసలు గొడవ ఇది డార్లింగ్!

Darling: ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య తెగిన పంచాయతీ.. అసలు గొడవ ఇది డార్లింగ్!

Sanjiv Kumar HT Telugu

Priyadarshi Nabha Natesh Darling Title Glimpse: గత కొన్ని రోజులుగా కమెడియన్ ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య డార్లింగ్ అనే కామెంట్ పెద్ద గొడవకు దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ డార్లింగ్ పంచాయితీ తెగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య తెగిన పంచాయతీ.. అసలు గొడవ ఇది డార్లింగ్!

Darling Title Glimpse Released: సినీ ఇండస్ట్రీలో కమెడియన్, యాక్టర్ ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య జరిగిన కామెంట్ వార్ తెలిసిందే. మొదట నభా నటేష్ ఫొటోలకు డార్లింగ్ అంటూ ప్రియదర్శి కామెంట్ చేశాడు. దానిపై హీరోయిన్ నభా నటేష్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇలా పరిచయం లేని వ్యక్తిన అలా ఎలా డార్లింగ్ అని పిలుస్తావ్ అంటూ కామెంట్స్ బాక్స్ వేదికగా ఫైర్ అయింది.

డార్లింగ్ అని ఎలా అంటాడు

డార్లింగ్ అనేది అందరినీ పిలుచుకునే పేరు అంటూ ప్రియదర్శి ఏదో కవర్ చేశాడు. తర్వాత పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మ గ్లామర్ ఫొటోలకు సైతం ప్రియదర్శి డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ ఉన్నావ్ డార్లింగ్ అని ప్రియదర్శి కామెంట్ చేశాడు. దీనిపై నభా నటేష్ రియాక్ట్ అయింది. ఇతను మళ్లీ స్టార్ట్ చేశాడు. అమ్మాయిలను డార్లింగ్ అని ఎలా పిలుస్తాడంటూ మళ్లీ రచ్చ చేసింది నభా.

ప్రమోషన్స్‌లో భాగంగా

నా ఫ్రెండ్‌ను డార్లింగ్ అని పిలుస్తుంటే నీకేంటి అని అదే కామెంట్ బాక్స్‌లో రివర్స్ క్వశ్చన్ వేశాడు ప్రియదర్శి. దీనిపై నా కామెంట్ బాక్స్‌లో మీ పంచాయతీ ఏంటీ అని రీతూ వర్మ సైతం అసహనం వ్యక్తం చేసింది. అయితే, తాజాగా ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ మధ్య నడిచిన డార్లింగ్ పంచాయతీ తెగింది. నిజానికి ఇదంతా డార్లింగ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో హీరోయిన్స్ చేసిన పబ్లిక్ స్టంట్.

రెండింటి నుంచి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ హిట్ ఫిల్మ్ డార్లింగ్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సెన్సేషనల్ హిట్ సాంగ్ వై దిస్ కొలవరి ఢీ రెండింటి నుంచి ప్రియదర్శి, నభా నటేష్ సినిమా రానుంది. డార్లింగ్ వై దిస్ కొలవరీ అనే టైటిల్‌తో వీరిద్దరూ జోడీగా సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఏప్రిల్ 20న డార్లింగ్ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ గ్లింప్స్ వదిలారు.

పెళ్లి ప్రపోజల్ లుక్

పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ సినిమాను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో డార్లింగ్ సినిమాను అనౌన్స్ చేశారు. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ పెట్టారు. నభా నటేష్‌కు ప్రియదర్శి పెళ్లి ప్రపోజల్‌ని చూపిస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ టైటిల్‌ లాగే ఆహ్లాదకరంగా ఉంది.

రిలీజ్ చేసిన ప్రశాంత్ వర్మ

డార్లింగ్ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ప్రియదర్శి, నభా నటేష్ మధ్య రిలేషన్‌ని చూపుతుంది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన ఈ డార్లింగ్ మూవీ గ్లింప్స్ పూర్తిగా హిలేరియస్‌గా ఉంది. సెలూన్‌లో ప్రియదర్శి, బార్బర్ మధ్య ఫన్నీ సంభాషణతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది.

ఆడవారి మనస్తత్వాలు

ఎందుకు దిగులుగా ఉన్నావ్ అని బార్బర్ అడిగినప్పుడు.. దర్శి జీవితంలోని వివిధ దశలలో ఆడవారి మనస్తత్వాలను చెబుతాడు. ఆడపిల్లలు తల్లులుగా ఉన్నప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. చెల్లాయిగా ఉన్నప్పుడు సపోర్టివ్‌గా ఉంటారు. అదే అమ్మాయి ప్రేమికురాలిగా ఉన్నప్పుడు.. క్యూట్‌గా, బబ్లీగా ఉండి మనల్ని చాలా అర్థం చేసుకుంటుంది.

ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా

కానీ, ఆ పిల్లే పెళ్లాం అయితే మన జీవితాన్ని తలకిందులు చేసి తాట తీస్తుందని ప్రియదర్శి చెప్పడం, వెంటనే నభా నటేష్ చూపులతో, మాటలతో దర్శికి చుక్కలు చూపించడం నవ్విస్తూ ఆకట్టుకునేలా ఉంది. అమ్మ ప్రేమ చెప్పినప్పుడు మహేష్ బాబు పెదవే పలికిన పాట, చెల్లెలి గురించి చెప్పేటప్పుడు పవన్ కల్యాణ్ అన్నయ్య అన్నావంటే ఎదురవనా సాంగ్, ఇక లవర్ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభాస్ మెల్లిగా కరగని సాంగ్స్ చూపించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.