Vasanthi Krishnan: పవన్ కల్యాణ్‌తో బిగ్ బాస్ వాసంతి ముద్దులు.. సెన్సార్‌షిప్ తీసుకురావాలంటూ ఫైర్
Vasanthi Krishnan Fiance Kiss In Interview: బిగ్ బాస్ 6 తెలుగుతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ వాసంతి కృష్ణన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు కాబోయే భర్త పవన్ కల్యాణ్‌తో ముద్దులు పెడుతూ రచ్చ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Vasanthi Krishnan Pawan Kalyan Kiss: తెలుగు నటి, బిగ్ బాస్ బ్యూటి వాసంతి కృష్ణన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ 6 తెలగు సీజన్‌లో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటిఫుల్ చాలా కాలం తర్వాత మరోసారి హైలెట్ అవుతోంది. అందుకు కారణం తాజాగా ఆమె ముద్దులు పెడుతూ రెచ్చిపోవడమే. ఇటీవల తనకు కాబోయే భర్త పవన్ కల్యాణ్‌తో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ముందే నోటి ద్వారా ద్రాక్షలు మార్చుకుంటూ వాసంతి కృష్ణన్, పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు. వాలంటైన్స్ డే సందర్భంగా యూట్యూబ్ ఛానెల్ ఈ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసింది. అందులో వారి వ్యక్తిగత, సినీ విశేషాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు యాంకర్. వాటికి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు వాసంతి కృష్ణన్ అండ్ పవన్ కల్యాణ్. ఇంటర్వ్యూ మొదట్లో కేక్ కట్ చేసి ప్రారంభించారు.
వాలంటైన్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి వాసంతి, పవన్ కల్యాణ్ ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం ఫ్లవర్స్ ఇచ్చి వాసంతి కృష్ణన్‌కు లవ్ ప్రపోజ్ చేశాడు పవన్ కల్యాణ్. ఒకరి జీవితంలో మరొకరు చాలా స్పెషల్ అంటూ మాటలు చెప్పుకున్నారు. దాంతో కాస్తా ఎమోషనల్ అయింది వాసంతి కృష్ణన్. పవన్ కల్యాణ్ కెమెరాల ముందు చాలా సైలెంట్‌గా ఉంటాడని, వెనుక మాత్రం చాలా రొమాంటిక్ అని, కొంటె పనులు చేస్తాడన్నట్లుగా తెలిపింది వాసంతి కృష్ణన్.
ఇలా సాగుతున్న ఇంటర్వ్యూలో ఫైనల్ టచ్ అంటూ వారికో టాస్క్ ఇచ్చారు యాంకర్. బౌల్‌లో ఉన్న ద్రాక్ష పళ్లను చేతులతో పట్టుకోకుండా నోటితో ఒకరికొకరు తినిపించుకోవాలి. అలా ఎక్కువగా ఎవరు తినిపిస్తే వాళ్లు గెలిచినట్లు యాంకర్ చెప్పారు. దాంతో ముందుగా పవన్ కల్యాణ్‌కు వాసంతి ద్రాక్షలను నోటితో అందించింది. ఈ క్రమంలో ఇద్దరు ముద్దులు పెట్టుకున్నంత పని అయింది. తర్వాత అది పోటీగా మారింది. అనంతరం వాసంతి కృష్ణన్‌కు పవన్ కల్యాణ్ ద్రాక్షలు అందించడం స్టార్ట్ చేశాడు.
ఈ క్రమంలో వాసంతి తినడం ఆపేసిన పవన్ కల్యాణ్ ఆమె తల ముందుకు అని ఫోర్స్‌గా ద్రాక్షలు పెట్టాడు. పోటీలో గెలవాల్సిందిగా యాంకర్ వారిని ఎంకరేజ్ కూడా చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ షాక్ అయ్యారు. పలువురు పలు విధాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. "వాళ్లు ప్రేమికులు అయినా, భార్యాభర్తలు అయినా సరే మీడియా ముందు ఇలాంటి పనులు చేయొద్దు" అని సలహా ఇస్తున్నారు.
"యూట్యూబ్ మీడియా ఛానెల్‌కు సెన్సార్‌షిప్ తీసుకురావాలి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ వాటి పరిమితులు దాటుతున్నాయి" అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. "వారు జంట అయినా సరే చూసేవారికి అసౌకర్యంగా ఉంది" అని మరొకరు అన్నారు. ఇలా వాసంతి కృష్ణన్ ఇప్పుడు హైలెట్ అవుతోంది. ఇదిలా ఉంటే వాసంతి కృష్ణన్ ఎన్నో తెలుగు సినిమాల్లో నటించినప్పటికి ఆమెకు బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో తన గ్లామర్‌తో మంచితనంతో యువతను ఆకట్టుకుంది వాసంతి కృష్ణన్. అలాగే అదే మంచి పేరుతో బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 6లో మంచి పేరు తెచ్చుకున్నవాళ్లలో వాసంతి ఒకరు. అయితే, తాజా వీడియోతో వాసంతికి కాస్తా నెగెటివిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.