Bullet Bandi Laxman: డైరెక్టర్‌గా మారిన బుల్లెట్ బండి లక్ష్మణ్.. అల్లా హే అల్లా సాంగ్ హీరో హీరోయిన్లతో మూవీ-allahe allaha song bullet bandi laxman movie launch tony kick sunitha marasiar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bullet Bandi Laxman: డైరెక్టర్‌గా మారిన బుల్లెట్ బండి లక్ష్మణ్.. అల్లా హే అల్లా సాంగ్ హీరో హీరోయిన్లతో మూవీ

Bullet Bandi Laxman: డైరెక్టర్‌గా మారిన బుల్లెట్ బండి లక్ష్మణ్.. అల్లా హే అల్లా సాంగ్ హీరో హీరోయిన్లతో మూవీ

Sanjiv Kumar HT Telugu
Apr 20, 2024 01:50 PM IST

Bullet Bandi Laxman Tony Kick Movie Launch: అల్లా హే అల్లా సాంగ్‌తో పాపులర్ అయిన బుల్లెట్ బండి లక్షణ్ డైరెక్టర్‌గా మారారు. ఈ పాటలోను టోని కిక్, సునిత మారస్యార్ హీరో హీరోయిన్లుగా చేస్తున్న కొత్త సినిమాను తాజాగా ప్రారంభించారు.

డైరెక్టర్‌గా మారిన బుల్లెట్ బండి లక్ష్మణ్.. అల్లా హే అల్లా సాంగ్ హీరో హీరోయిన్లతో మూవీ
డైరెక్టర్‌గా మారిన బుల్లెట్ బండి లక్ష్మణ్.. అల్లా హే అల్లా సాంగ్ హీరో హీరోయిన్లతో మూవీ

Bullet Bandi Laxman Movie Launch: యూట్యూబ్‌లో విడుదలైన అల్లా హే అల్లా సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఒక్క పాటతో బుల్లెట్ బండి లక్ష్మణ్, టోని కిక్, సునిత మారస్యార్‌కు విపరీతమైన పేరు వచ్చింది. ఇప్పుడు టోని కిక్, సునిత మారస్యార్ హీరో హీరోయిన్లగా నటిస్తున్న సినిమాతో బుల్లెట్ బండి లక్ష్మణ్ డైరెక్టర్‌గా మారారు.

A3 లేబుల్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను శుక్రవారం (ఏప్రిల్ 19)నహైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత చిన్నికృష్ణ క్లాప్ కొట్టగా, ఏఐ ప్లెక్స్ ప్రదీప్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

"ఏ 3 లేబుల్స్ బ్యానర్ పై ప్రదీప్, గిరీష్ గారు కలిసి సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథలోని అరవై సీన్స్‌ను నేను విన్నాను. రామ్, లక్ష్మణ్ కలిసి చేసిన ఆల్బమ్స్ సౌత్ ఇండియాలోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. వారి ఆల్బమ్‌లోని అల్లా హే అల్లా పాటను కథగా మార్చి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ టాప్ మోస్ట్ డైరెక్టర్‌గా నిలబడతారు" అని చిన్నికృష్ణ తెలిపారు.

"సినిమాను నమ్ముకుని, ప్రేమించి, కష్టపడితే ఎక్కడి వరకు రావచ్చు అనటానికి రామ్, లక్ష్మణ్‌లే ఉదాహరణ. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులారిటీ సంపాదించుకుని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి రావటం హ్యాపీ. వారు చేస్తున్న ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాత గారు కర్ణాటక నుంచి వచ్చి సినిమా చేస్తున్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని రచయిత వెలిగొండ శ్రీనివాస్ అన్నారు.

"సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఇబ్బందులు పడి వెనక్కి వెళ్లిపోయాం. అయితే జానపద పాటలు ద్వారా ప్రేక్షకుల ఆదరణ పొందాం. నాలోని సినిమా కలను గుర్తించిన మా నిర్మాత గిరీష్ కుమార్ గారు సినిమా చేయటానికి ముందుకు వచ్చారు. ముందుగా ఆయనకు ధన్యవాదాలు. ఆయన రుణ తీర్చుకోలేనిది" అని డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ తెలిపారు.

"ఇది వరకు నాలుగు నిమిషాల్లోని పాటలో ఓ కథను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మా నిర్మాత గారు రెండు గంటల సినిమా చేయమని ముందుకు వచ్చారు. మా ప్రతీ పాట, మాట థియేటర్స్‌కి ఆడియెన్స్‌ను రప్పించేలా, వారి మనసు మెప్పించేలా ఉంటాయి. మా టీమ్ సంకల్ప బలం నా వెనుకుంది. నన్ను యూట్యూబ్‌లో ఆదరించినట్లే సినిమాలోనూ ఆదరించాలని కోరుకుంటున్నాను" అని బుల్లెట్ బండి లక్ష్మణ్ కోరారు.

"మా డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఆయన చేసిన అల్లా హే అల్లా కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేశాం. నన్ను నమ్మి నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, నిర్మాత గిరీష్ కుమార్ గారికి థాంక్స్" అని హీరోగా మారిన టోని కిక్ చెప్పుకొచ్చాడు.

Whats_app_banner