Aa Okkati Adakku Twitter Review: ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూ.. అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా?
Aa Okkati Adakku Movie Twitter Review: అల్లరి నరేష్ కామెడీతో వచ్చిన కమ్ బ్యాక్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. చాలా గ్యాప్ తర్వాత కామెడీ జోనర్‌లో అల్లరి నరేష్ నటించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఆ ఒక్కటి అడక్కు ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..
Aa Okkati Adakku Twitter Review: తన కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన అల్లరోడు అల్లరి నరేష్. మొదటి నుంచి కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఇటీవల మధ్య కాలంలో నాంది, ఇట్లు మారెడుపల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు చేసి అలరించాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా నటించి ఎంటర్టైన్ చేశాడు నరేష్.
కొత్త దర్శకుడితో
ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ మరోసారి కామెడీతో నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లరి నరేష్ కమ్ బ్యాక్ కామెడీ సినిమా ఆ ఒక్కటి అడక్కు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సూపర్ హిట్ మూవీ టైటిల్‌కో వస్తోన్న ఈ సినిమా జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాతో మల్లి అంకం అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కమ్ బ్యాక్ కామెడీ మూవీ
ఇప్పటికీ ఆ ఒక్కటి అడక్కు సినిమా ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్‌పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఎట్టకేలకు ఈ సినిమా మే 3న అంటే శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్స్ ఆ ఒక్కటి అడక్కుపై ట్విటర్ రివ్యూ ఇస్తున్నారు. మరి ఈ అల్లరోడి కమ్ బ్యాక్ కామెడీ మూవీ హిట్ కొట్టిందా? లేదా? అనేది తెలుసుకుందాం.
ఇబ్బంది పెట్టేలా
"ఆ ఒక్కటి అడక్కు కథకు సంబంధించి పాజిటివ్ అంశాలు లేవు. పేలవమైన రైటింగ్, బలహీనమైన ప్రజంటేషన్‌తో ఇబ్బందిపెట్టేలా సినిమా ఉంది. 90లో సూపర్ హిట్ కామెడీగా నిలిచిన టైటిల్‌ను పెట్టి తప్పు చేశారు" అని క్లాప్ బోర్డ్ అనే పేరుతో ఉన్న నెటిజన్ నెగెటివ్‌గా రాసుకొచ్చాడు.
"ఆ ఒక్కటి అడక్కు సినిమా ఫస్టాఫ్ బిలో యావరేజ్‌గా ఉంది. సెకండాఫ్ కచ్చితంగా చాలా బాగుండాలి" అని నిరూత్సాంగా ఉన్నట్లు తెలియజేసేలా ఎమోజీలతో ఒక యూజర్ చెప్పుకొచ్చారు.
"అసలా ఎందుకు తీశారు.. ఏం తీశారు.. ఏం తీయాలనుకున్నారు.. అనేది డౌట్ వస్తుంది ఆ ఒక్కటి అడక్కు సినిమా చూస్తుంటే.." అని మరొకరు చాలా డిసప్పాయింట్ అయినట్లుగా రాసుకొచ్చారు.
"సినిమా పూర్తి అయి 30 నిమిషాలు అవుతుంది. ఒక 5 నిమిషాలు తప్పితే.. మిగతాదంతా అస్సలు బాలేదు" అన్నట్లుగా డిస్ లైక్ ఎమెజీస్ పెట్టారు టోలీ మస్తీ అనే అకౌంట్ అడ్మిన్. ఎక్కువగా ఈ అకౌంట్ నుంచే రివ్యూస్ వస్తున్నాయి. అవి కూడా చాలా నెగెటివ్‌గా రివ్యూస్ ఉంటున్నాయి. ఇంతకుమించి ఆ ఒక్కటి అడక్కు సినిమాపై ఎక్కువగా ట్విటర్ రివ్యూస్ రాలేదు.
చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తనదైన కామెడీతో అదరగొట్టేందుకు వచ్చిన అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాపై కాస్తా నెగెటివిటీ వస్తోంది. కాకాపోతే ఈ నెగెటివిటీ రెండు ట్విటర్ అకౌంట్స్ నుంచే వస్తోంది. సినిమాకు సంబంధించి మరింత టాక్ తెలుసుకోవాలంటే మాత్రం మార్నింగ్ షో అయ్యేవరకు ఆగాల్సిందే.