Faria Abdullah: పర్ఫెక్ట్ హస్బండ్-పర్ఫెక్ట్ వైఫ్ గురించి సినిమా.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా అబ్దుల్లా-faria abdullah comments on aa okkati adakku movie and action film heroines allari naresh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Faria Abdullah: పర్ఫెక్ట్ హస్బండ్-పర్ఫెక్ట్ వైఫ్ గురించి సినిమా.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: పర్ఫెక్ట్ హస్బండ్-పర్ఫెక్ట్ వైఫ్ గురించి సినిమా.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా అబ్దుల్లా

Sanjiv Kumar HT Telugu
Apr 29, 2024 06:07 AM IST

Faria Abdullah About Aa Okkati Adakku Movie: జాతి రత్నాలు సినిమాతో చిట్టిగా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తాజాగా ఆమె నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

పర్ఫెక్ట్ హస్బండ్-పర్ఫెక్ట్ వైఫ్ గురించి.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా అబ్దుల్లా
పర్ఫెక్ట్ హస్బండ్-పర్ఫెక్ట్ వైఫ్ గురించి.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుంది: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah About Aa Okkati Adakku: ఫరియా అబ్దుల్లా.. తెలుగు ప్రేక్షకుల్లోల చిట్టిగా మనసు దోచుకున్న హీరోయిన్. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు ఫరియా అబ్దుల్లా నటించిన కొత్త సినిమా ఆ ఒక్కటీ అడక్కు.పెళ్లి అంశం చుట్టూ తిరిగే కథతో వస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను ఫరియా తెలిపారు.

నరేష్ గారు అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న హీరోతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

నరేష్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. షూటింగ్ చాలా సరదాగా జరిగింది. నరేష్ గారి కామెడీ టైమింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఈ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తారు. ఇందులో చాలా హిలేరియస్ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది.

దర్శకుడు మల్లి అంకంతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

దర్శకుడు మల్లి గారు నాకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. అది నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అలాగే కథ గురించి చాలా చర్చించేవారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన అందరి సలహాలు తీసుకుంటారు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. సినిమా షూటింగ్ అంతా ఫన్‌గా జరిగింది.

ఇందులో పెళ్లి గురించి ఎలాంటి అంశాలు చర్చించారు ?

పర్ఫెక్ట్ వైఫ్, పర్ఫెక్ట్ హుస్బెండ్.. అంటూ చాలా సెలెక్టివ్‌గా మారిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు పెళ్లిలకి.. ఇప్పటి పెళ్లిలకి చాలా మార్పులు వచ్చేశాయి. మ్యాట్రీమొనీ సైట్స్‌లో ఎలా డీల్ చేస్తారనే అంశంతో పాటు పెళ్లికి సంబధించిన అనేక అంశాలు ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం.

నిర్మాతల గురించి ?

రాజీవ్ చిలక గారు చాలా పాషన్ ఉన్న నిర్మాత. సినిమాని ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది.

ఒక పాత్ర ఎంపిక చేసుకున్నపుడు ఏ అంశాలు చూస్తారు ?

పాత్ర ప్రాధాన్యత, నిడివి అన్నీ చూస్తాను. కొన్ని క్యామియో రోల్స్ కూడా చేశాను. రవితేజ గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. రావణాసురలో అవకాశం వచ్చింది. అది హీరోయిన్ పాత్ర అని చెప్పలేను కానీ ఆ పాత్ర చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?

టిపికల్ హీరోయిన్‌గా మాస్ మసాలా సినిమా చేయాలని ఉంది. అలాగే హారర్ థ్రిల్లర్ చేయాలని ఉంది. అలాగే కామెడీ సినిమా చేయాలని ఉంది. ఇప్పుడు పరిశ్రమలో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారు. ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది. యాక్షన్ సినిమాలు నాకు బాగా నప్పుతాయని భావిస్తున్నాను.

కాగా ఈ ఆ ఒక్కటి అడక్కు చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల కానుంది.