OTT: రెండు ఓటీటీల్లోకి సైలెంట్‌గా వచ్చిన తెలుగు అంథాలజీ మూవీ.. ఎన్నో ట్విస్టులతో తర్వాత రిలీజ్.. ఎక్కడంటే?
Sriranga Neethulu OTT Streaming Now: ప్రామిసింగ్ హీరో సుహాస్ నటించిన అంథాలజీ మూవీ శ్రీరంగనీతులు ఏకంగా రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది. ముందుగా యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేస్తారని అనౌన్స్‌మెంట్ వచ్చిన ఒక్కరోజు ముందే ఓటీటీలో సడెన్‌గా రిలీజ్ అయింది శ్రీరంగనీతులు సినిమా.
Sriranga Neethulu OTT Release: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు హీరో సుహాస్. కలర్ ఫొటోతో హీరోగా ప్రారంభమైన ఆయన కెరీర్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అయితే ప్రసన్నవదనం కంటే ముందుగా థియేటర్లలో విడుదలైన సుహాస్ సినిమా శ్రీరంగనీతులు. మే 3న ప్రసన్నవదనం సినిమా థియేటర్లలోకి వస్తే శ్రీరంగనీతులు ఏప్రిల్ 11న విడుదలైంది. కానీ, శ్రీరగంనీతులు మూవీ కంటే ముందుగానే ప్రసన్నవదనం మే 24 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
శ్రీరంగనీతులు చిత్రాన్ని ముందుగా జూన్ 7 నుంచి ఎవరు ఊహించని ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం వచ్చింది. సుహాస్ సినిమాలను ఎక్కువగా స్ట్రీమింగ్ చేసే ఆహా కాకుండా సోని లివ్‌లో (Sonyliv OTT) శ్రీరంగనీతులు రిలీజ్ కావడమనే విషయం ఆశ్చర్యకరంగా మారింది. కానీ, ఇటీవల రెండు రోజుల ముందు శ్రీరంగనీతులు మూవీని ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో (Youtube) విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.
యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు భవానీ హెచ్‌డీ మూవీస్ మీడియా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది కూడా. అది కూడా మే 30 అంటే గురువారం నుంచి ప్రసారం కానుందని పోస్టర్ ద్వారా తెలిపింది. కానీ, మళ్లీ మరో ట్విస్ట్‌తో ఏకంగా రెండు ఓటీటీల్లో శ్రీరంగనీతులు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా చెప్పిన డేట్ కంటే ఒకరోజు ముందు నుంచే డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
అంథాలజీ సినిమాగా వచ్చిన శ్రీరంగనీతులు మూవీ ఆహా ఓటీటీలో (Aha OTT) మే 29 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించి బుధవారం నాడు సోషల్ మీడియా వేదికగా సడెన్‌గా అధికారిక పోస్ట్ చేసింది ఆహా టీమ్. శ్రీరంగనీతులు స్ట్రీమింగ్ అవుతోంది అంటూ లింక్ లింక్ పొందుపరిచింది. ఆహా ఓటీటీలోనే కాకుండా శ్రీరంగనీతులు మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime OTT) ఓటీటీలో కూడా ప్రసారం అవుతోంది.
అమెజాన్ ప్రైమ్‌లో మే 29 నుంచే శ్రీరంగనీతులు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రెండింట్లో తెలుగు భాషలో మాత్రమే మూవీ అందుబాటులో ఉంది. దీంతో థియేటర్లలో మిస్ అయన ఈ చిత్రాన్ని ఏ ఓటీటీ అందుబాటులో ఉంటే అందులో ఎంచక్కా చూసేయొచ్చు. సోని లివ్, యూట్యూబ్, చివరిగా రెండు ఇతర ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చి డిజిటల్ ప్రీమియర్ విషయంలో మంచి ట్విస్టులే ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
అలాగే ఎప్పటిలాగే సుహాస్ నటించిన ఈ సినిమా కూడా ఆహాలో కూడా రావడం విశేషం. కాగా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన శ్రీరంగనీతులు మూవీకి పెద్దగా మంచి టాక్ రాలేదు. పెద్దగా హడావిడి లేకుండా విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఒకటి వచ్చిందో లేదో కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. దాంతో సినిమాకు కలెక్షన్లతో పాటు టాక్ కూడా రాలేదు.
కాగా ఈ మూవీలో సుహాస్‌తో (Suhas) పాటు కార్తీక్‌రత్నం, రుహానిశర్మ (Ruhani Sharma), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) మెయిన్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ చిత్రానికి వీఎస్ఎస్ ప్రవీణ్ దర్శకత్వం వహించారు.