Ramayanam: రామాయణం నుంచి లీకైన సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఫొటోలు.. మీరు చూశారా?
Ramayana Ranbir Kapoor Sai Pallavi Look Leaked: నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణం సినిమాలోని రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ లీక్ అయింది. సెట్ నుంచి లీకైన ఈ ఎపిక్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Sai Pallavi Ranbir Kapoor First Look Leaked: బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం మూవీ కోసం ఆసక్తిగా భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు, పాత్రల వివరాలను రహస్యంగా ఉంచారు. కానీ, సినిమాలో రాముడిగా యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
రామాయణ సెట్ నుంచి
అయితే తాజాగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఫొటోలు జూమ్ టీవీ ద్వారా లీక్ అయ్యాయి. ఈ ఫొటోలతో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నట్లు రివీల్ అయింది. అయోధ్య యువ రాజుగా సాంప్రదాయ దుస్తులు ధరించిన రణ్‌బీర్, యువరాణి లుక్‌లో సీతగా సాయి పల్లవి ఫొటోలు శనివారం (ఏప్రిల్ 27) రామాయణ సెట్స్ నుంచి లీకయ్యాయి.
సీతారాముడిగా
చారిత్రక ఇతిహాసంపై తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ నుంచి రణ్‌బీర్, సాయి పల్లవిల గ్లింప్స్‌ను జూమ్ టీవీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్ చల్ చేస్తున్నాయి. ఫొటోల్లో సీతారాముడిగా సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఎంతో అందంగా కనిపించారు.
క్యూరియాసిటీ పెంచేలా
వీరిద్ది జంట చాలా చూడముచ్చటగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రామాయణం సినిమా నుంచి లీకైన రణ్‌బీర్, సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ అటు బాలీవుడు, ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమలోను ఈ ఫొటో క్యూరియాసిటీని పెంచుతోంది.
తొలిసారిగా రణ్‌బీర్-సాయి పల్లవి
ఇకపోతే తొలిసారిగా రణ్‌బీర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. శ్రీ రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ కఠినమైన శాకాహార ఆహారం, వ్యాయామ దినచర్యను అనుసరిస్తున్నట్లు వివిధ ఎంటర్‌టైన్ మెంట్ పోర్టల్స్ తెలిపాయి. కొన్ని రోజుల క్రితం రామాయణ మూవీ సెట్ నుంచి లీకైన ఫోటోలు వార్తల్లో నిలిచాయి. అరుణ్ గోవిల్ దశరథ రాజు వేషధారణలో కనిపించగా, లారా దత్తా కైకేయి గెటప్‌లో కనిపించారు.
విభీషణుడిగా విజయ్ సేతుపతి
యానిమల్ విలన్ బాబీ డియోల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, సన్నీ డియోల్ వరుసగా కుంభకర్ణుడు, విభీషణుడు, హనుమంతుడి పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రామాయణం సినిమా వాల్మీకి మహర్షి రచించిన ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది.
ఓం రౌత్ ఆదిపురుష్
నితేష్ కంటే ముందు ఓం రౌత్ ఆదిపురుష్ (2023) అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ రాకపోవడమే కాకుండా, ఈ సినిమా బ్యాడ్ వీఎఫ్ఎక్స్, పురాతన పాత్రలను వక్రీకరించిందని ట్రోల్ చేశారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ కృతి సనన్, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు.
యానిమల్ మూవీతో
ఇదిలా ఉంటే, రణ‌్‌బీర్ చివరిసారిగా సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అతనికి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న యాక్ట్ చేసింది. అలాగే మూవీలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీ, సౌరభ్ సచ్ దేవా, శక్తి కపూర్ తదితరులు నటించారు.