Darshini: అతి తక్కువ బడ్జెట్‌లో సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దర్శిని.. కొత్త హీరో హీరోయిన్లతో మూవీ-tollywood science fiction thriller darshini trailer released sci fi movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Darshini: అతి తక్కువ బడ్జెట్‌లో సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దర్శిని.. కొత్త హీరో హీరోయిన్లతో మూవీ

Darshini: అతి తక్కువ బడ్జెట్‌లో సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దర్శిని.. కొత్త హీరో హీరోయిన్లతో మూవీ

Sanjiv Kumar HT Telugu
May 02, 2024 06:40 AM IST

Darshini Movie Trailer Released: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే కొత్త పాత అనే తేడా లేకుండా నూతన హీరోహీరోయిన్లతో తెలుగులో సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ మూవీగా దర్శిని రానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

అతి తక్కువ బడ్జెట్‌లో సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దర్శిని.. కొత్త హీరో హీరోయిన్లతో మూవీ
అతి తక్కువ బడ్జెట్‌లో సరికొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దర్శిని.. కొత్త హీరో హీరోయిన్లతో మూవీ

Science Fiction Thriller Darshini: వి 4 సినీ క్రియేషన్స్ పతాకంపై వికాస్ అండ్ శాంతి హీరో హీరోయిన్‌గా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం దర్శిని. ఈ సినిమాతో వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇక దర్శిని సినిమాను డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించారు. డాక్టర్ ఎల్‌వీ సూర్యం ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న దర్శిని ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు.

దర్శిని థియేట్రికల్ ట్రైలర్‌ను కెఎల్ దామోదర్ ప్రసాద్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "రెండున్నర సంవత్సరాల క్రితం ఈ దర్శిని టీం వాళ్లు ఫిలిం ఛాంబర్ దగ్గర నన్ను కలిశారు. ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొంది ప్రొఫెస్సర్స్‌గా రాణించి ఇప్పుడు దర్శిని అనే ఒక సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు" అని తెలిపారు.

"నన్ను మొదటి పోస్టర్‌ను విడుదల చేయమన్నారు. వైజాగ్‌లో ఒక ఈవెంట్‌లో దర్శిని చిత్ర మొదటి పోస్టర్‌ను విడుదల చేశాను. తర్వాత వీళ్ల ప్యాషన్ నచ్చి సినిమా చూసాను. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తక్కువ బడ్జెట్‌లో చాలా మంచి సినిమా తీశారు. త్వరలో విడుదల కాబోతుంది. విజయం సాధించాలి" అని కెఎల్ దామోదర్ ప్రసాద్ ఆకాంక్షించారు.

"మాకు ఈ సినిమా ఫీల్డ్ కొత్త. కానీ, సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో దర్శిని చిత్రాన్ని నిర్మించాం. ఈ ప్రయాణంలో మాకు బాగా సపోర్ట్ గా నిలిచిన మొదటి వ్యక్తి కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు. మాకు సపోర్ట్ గా నిలిచిన దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు" అని నిర్మాత డాక్టర్ ఎల్‌వి సూర్యం తెలిపారు.

"మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ దర్శిని చిత్రంలో మూడు ముఖ్య పాత్రలు, జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురుకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం" అని నిర్మాత పేర్కొన్నారు.

"కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు మా గాడ్ పాదర్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేము అందరం ఇప్పుడు ఒక ఫ్యామిలీ. అందరం సొంత సినిమాగా పని చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. మే నెలలో విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది" అని డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ అన్నారు.

"మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీలో చాలా కష్టాలు చుశాం. కానీ సినిమా మీద ప్యాషన్‌తో కష్టపడి పని చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో విడుదల అవుతుంది" అని హీరో వికాస్ తెలిపారు.

IPL_Entry_Point