Dhamaka Trailer Released: ధమాకా ట్రైలర్ వచ్చేసింది.. మాస్ యాక్షన్‌తో దుమ్మురేపిన మాస్ మహారాజా-ravi teja starred dhamaka movie trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamaka Trailer Released: ధమాకా ట్రైలర్ వచ్చేసింది.. మాస్ యాక్షన్‌తో దుమ్మురేపిన మాస్ మహారాజా

Dhamaka Trailer Released: ధమాకా ట్రైలర్ వచ్చేసింది.. మాస్ యాక్షన్‌తో దుమ్మురేపిన మాస్ మహారాజా

Dhamaka Trailer Released: మాస్ మహారాజా రవితేజ నటించిన రవితేజ ట్రైలర్ నేడు విడుదలైంది. తనదైన మాస్ యాక్షన్‌తో రవితేజ అదరగొట్టేశాడు. డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ధమాకా ట్రైలర్ రిలీజ్

Dhamaka Trailer Released: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రం డిసెంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సరికొత్త అప్డేట్ వచ్చింది. ధమాకా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. రవితేజ తనదైన మాస్ యాక్షన్‌తో దుమ్మురేపారు. కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో రవితేజ అదరగొట్టారు. ఇక పాటల విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులోని పాటలు శ్రోతలను ఇప్పటికే అలరిస్తున్నాయి.

ట్రైలర్ ఓ సారి గమనిస్తే.. “వాడు కోట్లలో ఒకడు.. కొడితే కోలుకోలేవు” అనే సంభాషమతో మొదలవుతుంది. “నేను వెనకున్నవాళ్లను చూసుకుని ముందుకు వచ్చినవాడిని కాదు.. వెనక ఎవ్వరూ లేకపోయినా ముందుకురావచ్చని ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడిని” అని రవితేజ చెప్పే డైలాగ్ ఈలలు వేయించేలా ఉంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ధమాకా సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా పనిచేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

సంబంధిత కథనం