OTT Horror Movie: ఓటీటీలో తమన్నా రాశీ ఖన్నా గ్లామరస్ హారర్ సినిమా- మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?-assamese ghost story baak aranmanai 4 ott release disney plus hotstar tamanna rashi khanna ott horror movies ott news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movie: ఓటీటీలో తమన్నా రాశీ ఖన్నా గ్లామరస్ హారర్ సినిమా- మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

OTT Horror Movie: ఓటీటీలో తమన్నా రాశీ ఖన్నా గ్లామరస్ హారర్ సినిమా- మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 20, 2024 12:39 PM IST

Horror Movie Aranmanai 4 OTT Streaming: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో అస్సామీ దెయ్యం కథ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన హారర్ మూవీ అరణ్మనై 4 రానుంది. జూన్ 21 అర్ధరాత్రి 12 గంటలకు రూ. 100 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ సినిమా అరణ్మనై 4 ఏ ఓటీటీలోకి రానుందనే వివరాల్లోకి వెళితే..

ఓటీటీలో తమన్నా రాశీ ఖన్నా గ్లామరస్ హారర్ సినిమా- మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలో తమన్నా రాశీ ఖన్నా గ్లామరస్ హారర్ సినిమా- మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

Assamese Ghost Baak OTT Release: సినీ లవర్స్‌కు హారర్ సినిమాలు ఇచ్చే కిక్ మాములుగా ఉండదు. సరికొత్త కథకథనాలతో ఆద్యంతం ఆసక్తికర, థ్రిల్లింగ్ అండ్ హారిఫిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ విజయంవైపుకు తీసుకెళ్తారు. ఇక హారర్ సినిమాలకు క్రియేటివ్ కామెడీ తోడైతే వచ్చే ఎంటర్టైన్‌మెంట్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది.

వేరు వేరు రెస్పాన్స్

అలా ఈ మధ్య హారర్ కామెడీ జోనర్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా అరణ్మనై 4. తమిళంలో ఈ సినిమా దాదాపుగా వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి భారీ హిట్ మూవీగా రికార్డుకెక్కింది. ఇక ఈ సినిమాను తెలుగులో బాక్ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. మే 3న తమిళంతోపాటు తెలుగులో విడుదలైన ఈ సినిమాకు రెండు చోట్ల వేరు వేరు రెస్పాన్స్ వచ్చింది.

అస్సామీకి చెందిన దెయ్యం

తమిళంలో అద్భుతమైన విజయం సాధించుకున్న అరణ్మనై 4 తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. తమిళులు మెచ్చిన ఈ హారర్ కామెడీ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పక్కన పెట్టేశారు. అయితే, అస్సాంలో బాక్ అనే ఘోస్ట్ గురించి కథకథలుగా చెప్పుకుంటారు. ఈ అస్సామీకి చెందిన బాక్ అనే దెయ్యం సౌత్‌కు వస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

స్పెషాలిటీ ఏంటని

కథ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగిందని పలు రివ్యూలు వచ్చాయి. అస్సామీకి చెందిన దెయ్యం వస్తే దాని రివేంజ్, ప్రవర్తన, జరిగే అంశాలు కొత్తగా ఉండాలి. కానీ, మనం రెగ్యులర్‌గా చూసిన సినిమాల్లోని సీన్లు ఉంటే దాని స్పెషాలిటీ ఏంటీ అని పలువురు రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అదిరిపోయే మ్యూజిక్-విజువల్స్

అయితే, రొటీన్ సీన్స్ ఉన్నప్పటికీ మూవీలోని విజువల్స్, టెక్నికల్ యాస్పెక్ట్స్, బీజీఎమ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, హిప్ హాప్ తమిళ అందించిన అమ్మ సాంగ్ అదిరిపోయాయని టాక్ వచ్చింది. ఇలా డిఫరెంట్ అభిప్రాయాలతో మంచి హిట్ కొట్టిన బాక్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేయనుంది. అరణ్మనై 4 ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది.

మరికొన్ని గంటల్లో

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అరణ్మనై 4 (Aranmanai 4 OTT Release) మూవీ జూన్ 21 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీన్ని అర్థరాత్రి 12 గంటల నుంచే తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, బాక్ ఓటీటీ రిలీజ్‌కు ఇంకా సుమారు 12 గంటల సమయం మాత్రమే ఉంది. తెలుగు ప్రేక్షకులు వద్దనుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

స్వీయ దర్శకత్వంలో

ఇకపోతే అరణ్మనై 4 సినిమాలో మిల్కీ భామ తమన్నా, ముద్దుగుమ్మ రాశీ ఖన్నా, సుందర్ సి ముఖ్య పాత్రలు పోషించారు. వెన్నెల కిశోర్, కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి ఇతర కీ రోల్స్ చేశారు. ఇక ఈ సినిమాకు యాక్టర్ అండ్ డైరెక్టర్, హీరోయిన్ ఖుష్బూ భర్త సుందర్ సి స్వీయ దర్శకత్వం వహించి నటించారు. ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగానే చేశారు.

హాట్ గ్లామర్ షో

ముఖ్యంగా రాశీ ఖన్నా, తమన్నా అచచో సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో తమ గ్లామర్‌తో పిచ్చెక్కించారు ఈ ముద్దుగుమ్మలు. ఇలా సూపర్ హాట్ గ్లామర్‌తో పాటు కామెడీ, హారర్ అంశాలను మేళవించి అరణ్మనై 4 అదే బాక్ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సుందర్ సి.

WhatsApp channel