Munjya OTT: ఓటీటీలోకి నవ్విస్తూ వణికించే హారర్ కామెడీ మూవీ.. థియేటర్లలో ఉండగానే! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Munjya OTT Streaming: ఓటీటీలోకి నవ్విస్తూ వణికించే హారర్ కామెడీ మూవీ మంజ్యా వచ్చేయనుంది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోన్న మంజ్యా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, ఓటీటీ రిలీజ్ డేట్ వివరాలు లీక్ అయ్యాయి. మరి హారర్ మూవీగా వచ్చిన మంజ్యా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే..
Munjya OTT Release: ఇటీవల హారర్ కామెడీ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ తరహా జోనర్‌లో ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, ఫాంటసీతోపాటు హారర్ చిత్రాలకు కామెడీ జోడించి ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలాంటి కోవకు చెందిన సినిమానే మంజ్యా.

ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన సరికొత్త హారర్ కామెడీ మూవీ మంజ్యా. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరొందిన మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ సమర్పణలో అమర్ కౌశిక్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మంజ్యా మూవీకి ఆదిత్య సర్పోత్‌దార్ దర్శకత్వం వహించారు. మంజ్యాలో శర్వారి వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్య రాజ్ (కట్టప్ప) కీలక పాత్రలు పోషించారు.
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా ఇటీవల జూన్ 7న విడుదలైంది మంజ్యా మూవీ. సినిమాకు విడుదలైన తొలి రోజు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా జోరుగా ఉన్నాయి. ఇలాంటి సరికొత్త హారర్ కామెడీ యాక్షన్ సినిమాను చూడలేదని హిందీ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. సరికొత్త కథానేపథ్యంలో థ్రిల్లింగ్ అంశాలతో మంజ్యా తెరకెక్కింది.
దెయ్యాలను కామెడీగా చూపిస్తూనే మరోవైపు వణికించేలా మంజ్యా తెరకెక్కింది. అయితే, ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శన అవుతుండగానే మంజ్యా ఓటీటీ డీటెల్స్ లీక్ అయ్యాయి. మంజ్యా మూవీ ఓటీటీ హక్కులకు భారీగానే డిమాండ్ ఏర్పడింది. దాంతో మంచి ధర పెట్టి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంజ్యా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది.
కాబట్టి, మంజ్యా మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. కానీ, మూవీ థియేట్రికల్ రన్ పూర్తియిన తర్వాతే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ బేస్ చేసుకుని మంజ్యాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే, ఇప్పటివరకు చాలా వరకు సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చాయి. వాటి దారిలోనే మంజ్యా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
అలా చూసుకుంటే మంజ్యా మూవీని జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. కాబట్టి మరికొన్ని రోజుల్లోనే మంజ్యా సినిమాను ఎంచక్కా ఓటీటీలో చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్, మౌత్ టాక్ పరంగా ఏమైనా మార్పులు ఉండే ఛాన్స్ కూడా ఉంది.
ప్రస్తుతానికి మంజ్యా ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా బ్యూటిఫుల్ శర్వారి నటించిన మంజ్యా సినిమాను జూన్ 7న దాదాపుగా 1000 స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు మొత్తంగా సుమారుగా రూ. 30 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం.
ఇక మంజ్యా సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. అతి త్వరలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మంజ్యా మూవీకి 5 రోజుల్లో రూ. 27.25 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థలు రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి.
టాపిక్