Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?-hero siddharth new movie with director sri ganesh as bilingual and working title is siddharth 40 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
May 19, 2024 01:28 PM IST

Telugu Tamil Bilingual Movie Siddharth 40: యంగ్ హీరో సిద్ధార్థ్ తన కెరీర్‌లో 40వ చిత్రం బైలింగువల్ మూవీగా వస్తోంది. సిద్ధార్థ్ 40 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్నఈ సినిమాను తెలుగు, తమిళంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పూర్తి వివరాల్లోకి వెళితే..

సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?
సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Siddharth 40 Bilingual Movie: సక్సెస్ ఫుల్ పాన్-ఇండియన్ యాక్టర్ సిద్ధార్థ్ చిత్ర పరిశ్రమలో 21 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రతి పరిశ్రమలో శాశ్వత ప్రభావాన్ని చూపారు. అతను ఎంచుకునే కథలు, పాత్రల, అసాధారణమైన పెర్ఫార్మెన్స్‌తో అద్భుతంగా అలరిస్తున్నాయి. బాలీవుడ్‌లో 'రంగ్ దే బసంతి'తో చెరగని ముద్ర వేశారు.

తెలుగులో 'బొమ్మరిల్లు' సినిమాతో ప్రేక్షకుల మన్ననలు పొందారు సిద్ధార్థ్. తమిళ పరిశ్రమలో పలు జోనర్‌లలో మెరిసి.. సినిమా, నటనపై తనకున్న గొప్ప అభిరుచిని చూపించారు సిద్ధార్థ్. ఆయన రీసెంట్ మూవీ 'చిత' ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇప్పుడు 'సిద్ధార్థ్ 40'( వర్కింగ్ టైటిల్) పేరుతో మరో ఎగ్జయిటింగ్ మూవీ కోసం కోసం మంచి యూనిట్‌తో చేతులు కలిపారు.

ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌ను '8 తొట్టక్కల్' (తెలుగులో 8 బుల్లెట్స్) ఫేమ్ డైరెక్టర్ శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' (తెలుగులో మహావీరుడు) నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలు చెప్పారు సిద్ధార్థ్.

"యూనివర్సల్ ఆడియన్స్ అభిరుచులను ఆస్వాదించే మంచి కంటెంట్‌ను అందించాలనే దృక్పథాన్ని కలిగి ఉన్న మన పరిశ్రమలోని యంగ్ టీంతో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సినిమా ఔత్సాహికులు, ఫ్యామిలీస్ 'చిత'పై తమ ప్రేమను కురిపించారు ఇది వారి భావాలను హత్తుకుని, మంచి కథలను ఎంచుకోవడానికి నాలో మరింత బాధ్యతను నింపింది" అని హీరో సిద్ధార్థ్ తెలిపారు.

"నేను చాలా స్క్రిప్ట్‌లు విన్నాను. శ్రీ గణేష్ చెప్పిన ఈ కథ నాకు ఎంతగానో నచ్చింది. ప్రేక్షకులపై ప్రభావం చూపే సినిమాలను తీయడమే నిర్మాతల ఆనందం. అలాంటి మంచి నిర్మాత అరుణ్ విశ్వతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన మంచి సినిమాతో పరిశ్రమను ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కనే నిర్మాత. మా అంకితభావం, పాషన్‌తో ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే అద్భుతమైన సినిమాని అందిస్తాయనే నమ్మకం నాకుంది" అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.

"నేను స్క్రిప్ట్ వర్క్ చేయడం ప్రారంభించినప్పుడు.. యూత్‌తో పాటు పరిణతి గల నటుడు కావాలని భావించాను. అప్పుడే సిద్దార్థ్ గారిని అనుకున్నాను. కథ చెప్పడానికి ఆయన్ని కలిసినప్పుడు, తను పూర్తిగా ఎంగేజై ఉన్నప్పటికీ చాలా విలువైన సూచనలను కూడా పంచుకున్నారు. ఇది చాలా ప్రశంసనీయం. మంచి పాషన్ ఉన్న నిర్మాత అరుణ్ విశ్వతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా వుంది" అని డైరెక్టర్ శ్రీ గణేష్ పేర్కొన్నారు.

"శాంతి టాకీస్‌కి మా అమ్మ పేరు పెట్టాం. మా అమ్మ థియేటర్లలో చూసి ఆనందించగలిగే ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవాలని భావిస్తాను. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షించే కమర్షియల్ చిత్రాలని రూపొందించడమే శాంతి టాకీస్ లక్ష్యం" అని నిర్మాత అరుణ్ విశ్వ తెలిపారు.

"శ్రీ గణేష్ అద్భుతమైన రచన చాలా ఆకట్టుకుంటుంది. అతను స్క్రిప్ట్ వివరించినప్పుడు.. ఇది అన్ని వయసుల ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా, భాష సరిహద్దులకు అతీతంగా ఆకర్షించే చిత్రం అని నేను బలంగా నమ్మాను. సినిమాపై సిద్దార్థ్‌కు ఉన్న ప్యాషన్‌ అద్భుతం. నేను అతనితో పని చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మేము త్వరలో సర్‌ప్రైజింగ్ అనౌన్స్ మెంట్స్ చేస్తాం" అని నిర్మాత అరుణఅ విశ్వ అన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024