Hanuman TV Contest: టీవీలో హనుమాన్ మూవీ.. సర్‌ప్రైజింగ్‌గా సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు కళ్లు చెదిరే గిఫ్ట్స్
Hanuman Selfie Contest On TV Premiere: యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమాను బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్‌గా సెల్ఫీ కాంటెస్ట్‌ను తీసుకొచ్చింది జీ తెలుగు ఛానెల్. ఈ పోటీకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Hanuman Movie TV Premiere: వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాతో ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ (Zee5 OTT) ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది జీ తెలుగు.
ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన 'హనుమాన్' చిత్రాన్ని ఆస్వాదించడానికి మీరూ సిద్ధంగా ఉండండి. బుల్లితెరపై ‘హనుమాన్’ ఆగమనం ఈ ఆదివారం (ఏప్రిల్ 28) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో మాత్రమే అంటూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఈ వారాంతాన్ని మరింత స్పెషల్ చేసేందుకు సూపర్ హిట్ సినిమా హనుమాన్తో పాటు మరిన్ని సర్ప్రైజ్లను అందిస్తోంది జీ తెలుగు.
ఈ క్రమంలోనే హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్‌ను తీసుకొచ్చింది జీ తెలుగు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ సెల్ఫీ కాంటెస్ట్‌లో పాల్గొని కళ్లుచెదిరే కిచెన్ ఐటెమ్స్‌ని బహుమతులుగా పొందవచ్చు. ఇందుకోసం ప్రేక్షకుల పిల్లలకి ఇష్టమైన సూపర్ హీరో గెటప్ వేసి వారితో ఒక సెల్ఫీ తీసుకుని 9966034441 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదంటే టీవీ స్క్రీన్‌పైన కనిపించే QR కోడ్‌ని స్కాన్ చేసి కూడా సెల్ఫీని అప్లోడ్ చేయవచ్చు.
విజేతల వివరాలను హనుమాన్ సినిమా ప్రసార సమయంలో ప్రకటిస్తారు. అంతేకాదు హనుమాన్ జిగ్సా ఫజిల్ గేమ్‌ని zeeteluguhanuman.zee5.com కి లాగిన్ అయి ఇచ్చిన టైమ్‌లోగా లెవల్స్‌ను పూర్తి చేయాలి. అలా స్కోర్ బోర్డులో లీడర్‌గా నిలవండని జీ తెలుగు తెలిపింది.
ఇక హనుమాన్ సినిమా అందమైన అంజనాద్రి గ్రామం నేపథ్యంలో సాగుతుంది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పోషించిన హనుమంతు పాత్ర చుట్టూ తిరుగుతుంది. హనుమంతు మంచి మనసు కలిగిన ఒక దొంగ. తన ప్రియురాలు మీనాక్షిని వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలనేది అతని కల. కానీ హనుమంతుకి దొరికిన రుధిరమణి కారణంగా అద్భుత శక్తులు వస్తాయి. దాంతో ఆ గ్రామంలో హీరో అవుతాడు.
ప్రముఖ నటుడు వినయ్ రాయ్ ఈ సినిమాలో విలన్‌గా నటించారు. రుధిరమణి కోసం జరిగిన పోరులో ఎవరు గెలిచారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఆకట్టుకునే కథ, యాక్షన్ సీక్వెన్స్, హనుమంతు, మీనాక్షి(అమృతా అయ్యర్)ల ప్రేమ వంటి అంశాలతో ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులను ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేస్తుందనడంలో సందేహం లేదు.
ప్రేమ, ధైర్యం, దైవత్వంతో ముడిపడి ఉండే హనుమాన్ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో తేజ సజ్జా, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
అదిరిపోయే విజువల్స్, హృదయాన్ని హత్తుకునే యాక్షన్, ఆకట్టుకునే నటనతో మునుపెన్నడూ లేని విధంగా హనుమాన్ సినిమా వినోదాన్ని పంచుతుంది. మనసుని హత్తుకునే కథ, కథనంతో సాగే హనుమాన్ సినిమాని మీరూ మిస్ కాకుండా బుల్లితెరపై చూసేయండి.